Electric Shock : విద్యుత్ షాక్ తో ఇద్దరు కూలీలు, రక్షించేందుకు వెళ్లిన అంగన్ వాడీ ఆయా మృతి

వీరు ఇనుపచువ్వ పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. సమీపంలో ఉన్న అంగన్ వాడీ ఆయా రియమ్మ(57) కాపాడేందుకు వెళ్లి వారిని పట్టుకోవడంతో ఆమె కూడా విద్యుత్ షాక్ గురయ్యారు.

Electric Shock : విద్యుత్ షాక్ తో ఇద్దరు కూలీలు, రక్షించేందుకు వెళ్లిన అంగన్ వాడీ ఆయా మృతి

electric shock (1)

Updated On : August 5, 2023 / 1:31 AM IST

Electric Shock Three Died : ఏపీ(AP)లోని విజయనగరం(Vizianagaram)జిల్లాలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు కూలీలు విద్యుత్ షాక్ కు గురయ్యారు. వారిని రక్షించేందుకు వెళ్లిన అంగన్ వాడీ ఆయా(Anganwadi Aaya)కు సైతం విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. సంతకవిటి(Santhakaviti) మండలం సోమన్నపేట(Somannapeta)గ్రామానికి చెందిన రామినాయుడు అనే ఇంటి యజమాని ఇంటి నిర్మాణం పనులు చేసేందుకు పి.కేసరి(22), జి.చంద్రశేఖర్(18) అనే కూలీలు వెళ్లారు.

వీరు ఇనుపచువ్వ పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. సమీపంలో ఉన్న అంగన్ వాడీ ఆయా రియమ్మ(57) కాపాడేందుకు వెళ్లి వారిని పట్టుకోవడంతో ఆమె కూడా విద్యుత్ షాక్ గురయ్యారు. దీంతో ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు.

Kanwar Yatra Tragedy : కన్వర్ యాత్రలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఐదుగురు దుర్మరణం

ముగ్గురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు మృతదేహాను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.