Buttabomma: రిలీజ్ వాయిదా వేసుకున్న బుట్టబొమ్మ.. ఎప్పుడు వస్తుందంటే..?

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కప్పేల’ చిత్రాన్ని తెలుగులో ‘బుట్టబొమ్మ’ అనే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శౌరీ చంద్రశేఖర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్, టీజర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది.

Buttabomma: రిలీజ్ వాయిదా వేసుకున్న బుట్టబొమ్మ.. ఎప్పుడు వస్తుందంటే..?

Buttabomma Movie Release Postponed

Buttabomma: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కప్పేల’ చిత్రాన్ని తెలుగులో ‘బుట్టబొమ్మ’ అనే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శౌరీ చంద్రశేఖర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్, టీజర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది.

Buttabomma Song: ‘అలా’ బుట్టబొమ్మ పాట.. కొనసాగుతున్న రికార్డుల మోత!

ఇక ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను జనవరి 25న కాకుండా ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

దీంతో బుట్టబొమ్మ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీగా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్యలు ప్రొడ్యూస్ చేస్తుండటంతో సినీ వర్గాల్లోనూ బుట్టబొమ్మ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.