Buttabomma Song: ‘అలా’ బుట్టబొమ్మ పాట.. కొనసాగుతున్న రికార్డుల మోత!

బుట్టబొమ్మ.. బుట్టబొమ్మా.. నన్నుసుట్టూకుంటివే.. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూకుంటివే’.. గత ఏడాదిగా ఈ పాట ఎంత మార్మ్రోగిపోతుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆడియో పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ పాట ఎంతో వైరల్ అయింది.

Buttabomma Song: ‘అలా’ బుట్టబొమ్మ పాట.. కొనసాగుతున్న రికార్డుల మోత!

Ala Buttabomma Song Ongoing New Record

Buttabomma Song: బుట్టబొమ్మ.. బుట్టబొమ్మా.. నన్నుసుట్టూకుంటివే.. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూకుంటివే’.. గత ఏడాదిగా ఈ పాట ఎంత మార్మ్రోగిపోతుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆడియో పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ పాట ఎంతో వైరల్ అయింది. ఈ పాటకి యూట్యూబ్ లో ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయో మనం చూశాం. సామాన్యుల దగ్గరి నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పాటకు ఫిదా అయిపోయారు.

‘అల’ మన దక్షిణాదిలోనే పలు ఫాస్టెస్ట్ భారీ రికార్డులు కొల్లగొట్టిన ఈ సాంగ్ తాజాగా మరో రికార్డును రీచ్ అయ్యింది. ఏకంగా మన దేశంలోనే ఫాస్టెస్ట్ 4 మిలియన్ లైక్డ్ వీడియోగా బుట్టబొమ్మ సాంగ్ నయా రికార్డు సెట్ చేసి పెట్టింది. దీనితో బన్నీ ఖాతాలో మరో సాలిడ్ రికార్డు పడ్డట్టు అయ్యింది. ఎస్ ఎస్ థమన్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు మరోస్థాయి విజయాన్ని అందుకోవడంలో ఎంతగానో దోహదపడగా ఇప్పటికీ సోషల్ మీడియాలో రికార్డులు నెలకొల్పోతుంది.

కాగా, ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తుండగా.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కబెడుతున్నాడు. ఇక అలా వైకుంఠపురం సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ అయితే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎవరికి వారు వారి సినిమాలతో బిజీగా ఉన్నా ఈ కాంబినేషన్లో వచ్చిన ‘అల’ పాట మాత్రం ఇప్పటికీ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూనే ఉంది.