Cm Revanth – Harish Rao: కేసీఆర్ మీద ఒట్టేసి బీజేపీలో చేరనని చెప్పగలరా? హరీశ్ కి సీఎం రేవంత్ సవాల్
మీటింగ్ వదిలేసి మరీ హరీశ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనడంలో అనుమానం లేదు.
Cm Revanth – Harish Rao: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. హరీశ్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే క్లారిటీ లేదన్నారు. ఫ్యూచర్ లో ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదన్నారు. కేసీఆర్ మీద ఒట్టేసి బీజేపీలో చేరనని హరీశ్ చెప్పగలరా అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. 2008లో హరీశ్ రావు వైఎస్ ని కలిసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారు నాకు తెలియదా? అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు మీరు ఏం చేశారు? భీమవరంలో పోటీ చేస్తానన్నప్పుడు ఏమైంది మీ తెలివి? ఏపీలో టీఆర్ఎస్ కమిటీ వేసినప్పుడు సిగ్గనిపించలేదా..? ఎందుకా సిగ్గుమాలిన బతుకు? అంటూ విరుచుకుపడ్డారు.
కేసీఆర్ కుటుంబం ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, శక్తులు ప్రదర్శించినా తనను ఏమీ చేయలేరని రేవంత్ అన్నారు. తనకు ఓ ప్లాన్ ఉందని, ప్రతీ దానికి తన దగ్గర ఓ పరిష్కారం ఉందని చెప్పారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సైతం సవాల్ విసిరారు సీఎం రేవంత్. జూన్ 15 వరకు ప్రతి గింజను కొంటామన్నారు. ధాన్యాన్ని ప్రధాని మోదీతో కిషన్ రెడ్డి కొనిపించాలన్నారు. లేదంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇళ్ల ముందు ధాన్యం పోస్తామన్నారు. జూన్ 15 తర్వాత కిషన్ రెడ్డి, మోదీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, తనది సక్సెస్ కాంబినేషన్ అన్నారు రేవంత్ రెడ్డి. ఇద్దరి కాంబినేషన్ లో అన్ని ఎన్నికలు గెలిచామన్నారు. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామని, పార్టీని అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. అంతేకాదు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహేశ్ గౌడ్ కి మంచి పదవి రావొచ్చని, మంత్రి కూడా కావొచ్చని అన్నారు.
Also Read: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5వేల పోస్టుల భర్తీకి సర్కార్ నిర్ణయం..
