Nithiin : టీడీపీ ఎమ్మెల్యేతో నితిన్ మీటింగ్.. ఫోటోలు వైరల్..
టాలీవుడ్ హీరో నితిన్ టీడీపీ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని, అతని ఫ్యామిలీని కలిశారు.

తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ టీడీపీ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని, అతని ఫ్యామిలీని కలిశారు.

బొజ్జల సుధీర్ రెడ్డి నితిన్ తో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

నితిన్ తో దిగిన ఫోటోలను షేర్ చేసి.. నా మిత్రుడు నితిన్ ఈరోజు మా నివాసానికి విచ్చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చిన నితిన్ నా కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా కాసేపు గడిపారు. ఈ సందర్భంగా మా మధురమైన స్మృతులను ఇద్దరం కలిసి నెమరువేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సమయం కేటాయించి మా ఇంటికి వచ్చి, మా కుటుంబంతో ఇంతటి ఆత్మీయ సమయాన్ని పంచుకున్నందుకు నా ప్రియ మిత్రుడు నితిన్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.

Nithiin Meets TDP MLA Bojjala Sudhir Reddy
