Nenevaru: నేనెవరు? చిత్రానికి అద్భుత స్పందన.. పెరుగుతున్న థియేటర్స్.. చిత్ర యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు
రాజేంద్రప్రసాద్ నేనెవరు?(Nenevaru) సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు.
Rajendra Prasad Nenevaru movie getting wonderful response from audience.
- ‘నేనెవరు?’ చిత్రానికి ప్రేక్షకుల అద్భుత స్పందన.
- పెరగనున్న సినిమా థియేటర్ల సంఖ్య.
- చిత్ర యూనిట్‌ను అభినందించిన రాజేంద్రప్రసాద్.
Nenevaru: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యంగ్ డైరెక్టర్ చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక వినోదాత్మక చిత్రం “నేనెవరు?(Nenevaru)”. మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన తెచ్చుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అనేక కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతుండటంతో, లభిస్తున్న పాజిటివ్ టాక్ ఆధారంగా థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి వెల్లడించారు.
Neha Shetty: నెటెడ్ డ్రెస్సులో నేహా శెట్టి గ్లామర్ అటాక్.. నయా లుక్ తో సెన్సేషన్.. ఫొటోలు
ఈ ఘన విజయంపై డా. రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఒక మంచి కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. సినిమాలో సాయికిరణ్, జోగిని శ్యామల నటనతో పాటు భావోద్వేగాలు, కోర్టు సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చిత్ర బృందం తెలిపింది.
దర్శకుడి కథనంతో పాటు చిన్నికృష్ణ సంగీతం, నాయుడు ప్రసాద్ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి – తారకరామారావు ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. “ప్రతి ఒక్కరూ చూడాల్సిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్” అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆడియన్స్ నుండి వస్తున్న భారీ డిమాండ్‌ను బట్టి మరిన్ని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
