Bollywood : ప్రముఖ నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌పై కేసు నమోదు

బాలీవుడ్, మరాఠిలో డైరెక్టర్ గా చాలానే సినిమాలు తెరకెక్కించారు మహేష్ మంజ్రేకర్. ఇటీవల 'నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నై కొంచా' అనే మరాఠి సినిమాని తీశారు. ఈ సినిమా ఎక్కువగా పిల్లలతో.......

Bollywood : ప్రముఖ నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌పై కేసు నమోదు

Mahesh

Mahesh Manjrekar :  బాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌, నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌పై కేసు నమోదైంది. అదుర్స్, డాన్ శీను, అఖిల్, గుంటూరు టాకీస్, సాహో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా విలన్ క్యారెక్టర్స్ తో దగ్గరయ్యాడు. బాలీవుడ్, మరాఠిలో డైరెక్టర్ గా చాలానే సినిమాలు తెరకెక్కించారు మహేష్ మంజ్రేకర్. ఇటీవల ‘నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నై కొంచా’ అనే మరాఠి సినిమాని తీశారు. ఈ సినిమా ఎక్కువగా పిల్లలతో చిత్రీకరించారు. పిల్లలపై జరిగే కొన్ని ఆకృత్యాలతో, వాళ్ళని బానిసలుగా చూసే అంశాలపై ఈ సినిమాని తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాలో మైనర్‌ పిల్లలపై అభ్యంతకర సన్నివేశాలను తెరకెక్కించారనే ఆరోపణలతో ముంబై మహిమ్‌ పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. దీంతో డైరెక్టర్‌ మహేశ్‌ మంజ్రేకర్‌పై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. సినిమాలోని కొన్ని సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహరాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ దేశ్‌పాండే ముంబై సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేసింది.

Saiee Manjrekar : బాలీవుడ్ నిర్మాత తనయుడితో ‘గని’ బ్యూటీ ప్రేమాయణం

ఇందులో నటించిన పిల్లలంతా మైనర్లని, అలాంటి వారితో అభ్యంతకర దృశ్యాలను చిత్రీకరించడం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. సీమ దేశ్‌పాండే ఫిర్యాదు మేరకు మహేశ్‌ మంజ్రేకర్‌పై ఐపీసీ 292, 34 సెక్ష‌న్ల‌తో పాటు పోక్సో సెక్ష‌న్ 14, ఐటీ యాక్ట్ 67, 67బీ కింద కేసు న‌మోదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.