Bigg Boss 5 : బిగ్‌బాస్‌ ఫినాలేకి క్యూ కడుతున్న సెలబ్రిటీలు

వాళ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. ఈ ఫినాలేకి ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు రాబోతున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు రిలీజ్ ఉండటంతో ఆ సినిమా సెలబ్రిటీలనే తీసుకొస్తే...........

Bigg Boss 5 :  బిగ్‌బాస్‌ ఫినాలేకి క్యూ కడుతున్న సెలబ్రిటీలు

Bigg Boss Finale

Bigg Boss 5 :  ఇవాళ్టితో బిగ్ బాస్ అయిపోతుండటంతో ప్రేక్షకులు, కంటెస్టెంట్స్ అభిమానులు విన్నర్ ఎవరు అవుతారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సిరి, మానస్ కూడా ఎలిమినేట్ అయిపోవడంతో టాప్ 3లో షణ్ను, సన్నీ, శ్రీరామ్ ఉన్నారు. ఇపుడు వీళ్ళ ముగ్గురిలో విన్నర్ ఎవరు అవుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. ఈ ఫినాలేకి ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు రాబోతున్నారు.

ప్రస్తుతం వరుసగా సినిమాలు రిలీజ్ ఉండటంతో ఆ సినిమా సెలబ్రిటీలనే తీసుకొస్తే ఒక వైపు ప్రమోషన్స్ అవుతాయి, మరోవైపు బిగ్ బాస్ ఫినాలేలో స్టార్స్ సందడి చేసినట్లు ఉంటుందని బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా ప్లాన్ చేసినట్టు సమాచారం. దీంతో ఇవాళ బిగ్ బాస్ ఫినాలేకి సెలబ్రిటీలు క్యూ కట్టనున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి రాజమౌళి, రామ్‌చరణ్‌, అలియా భట్‌ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్ కూడా చేయబోతున్నారు. ఆలియా నిన్న ‘బ్రహ్మాస్త్ర’ మోషన్ పోస్టర్ లాంచ్ కి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే ఉండటంతో బిగ్ బాస్ కి తీసుకొస్తున్నట్టు సమాచారం.

Bigg Boss 5 : మన రిలేషన్‌షిప్ బిగ్‌బాస్ వరకే.. షణ్నుకి గుర్తుచేసిన సిరి

మరో అయిదు రోజుల్లో న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ విడుదలకి ఉండటంతో ఈ సినిమా టీం నుంచి నాని, సాయి పల్లవి, కృతి శెట్టి బిగ్ బాస్ కి రాబోతున్నారు. సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే నాని గతంలో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించడంతో నాని రాక మరింత ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం అంతా ‘పుష్ప’ మాయ కనపడుతుంది. థియేటర్స్ లో ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కూడా బిగ్ బాస్ ఫినాలేకి వచ్చే సూచనలు ఉన్నాయని సమాచారం.

Aarya 3 : విజయదేవరకొండ సినిమా తర్వాత ‘ఆర్య 3’ ఉండొచ్చేమో

ఇక మన మొదటి వరల్డ్ కప్ బయోపిక్ గా రాబోతున్న బాలీవుడ్ సినిమా ’83’ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా నాగార్జున రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కూడా వచ్చే వారం రిలీజ్ అవ్వనుండటంతో నాగార్జున ఈ సినిమా హీరో రణవీర్ సింగ్ ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ సారి బిగ్ బాస్ ఫినాలే సెలబ్రిటీలతో కళకళలాడబోతుంది. అయితే కప్పు ఎవరి చేతుల మీదుగా ఇపిస్తారనేది మాత్రం ఇంకా తెలియలేదు.