Upcoming Movies: మారుతున్న ట్రెండ్.. గ్లామర్ హీరోయిన్స్‌కు అన్నలు అవుతున్న హీరోలు!

గ్లామర్ హీరోయిన్స్.. చెల్లెళ్లు, కూతుర్లు అయిపోతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన డిఫరెంట్ గా కనిపించబోతున్నారు. అటు పెద్ద హీరోలు.. ఏజ్ పెరుగుతున్నా.. వీళ్ల పక్కన హీరోగానే చేస్తామని కాకుండా అన్నలు, నాన్నలుగా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Upcoming Movies: మారుతున్న ట్రెండ్.. గ్లామర్ హీరోయిన్స్‌కు అన్నలు అవుతున్న హీరోలు!

Upcoming Movies

Upcoming Movies: గ్లామర్ హీరోయిన్స్.. చెల్లెళ్లు, కూతుర్లు అయిపోతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన డిఫరెంట్ గా కనిపించబోతున్నారు. అటు పెద్ద హీరోలు.. ఏజ్ పెరుగుతున్నా.. వీళ్ల పక్కన హీరోగానే చేస్తామని కాకుండా అన్నలు, నాన్నలుగా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొత్తానికి ట్రెండ్ మారుస్తున్నారు.

Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే!

వెంకటేశ్ చెల్లెలిగా పూజా హెగ్డే నటించనుంది. అవును ఎఫ్3 సినిమాలో పూజాతో కలిసి స్పెషల్ సాంగ్ కి స్టెప్పులేసిన వెంకీ.. ఆమెకు అన్నగా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా కభీ ఈద్ కభీ దివాళీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేశ్ ఫుల్ లెంత్ రోల్ కి యాక్సెప్ట్ చేశాడు. త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ మూవీలో బుట్టబొమ్మకు బ్రదర్ గా వెంకీ నటిస్తున్నారు.

Telugu Upcoming Movies: హీరోయిన్ల కొరత.. అప్షన్లు తెగ వెతికేస్తున్న మేకర్స్!

భోళాశంకర్ సినిమాలో చిరూ చెల్లెలుగా కీర్తిసురేశ్ నటిస్తోంది. ముందు సాయిపల్లవిని అనుకున్నా ఆమె ఇంట్రెస్ట్ చూపించలేదు. సో కీర్తిని ఫైనల్ చేసి సినిమాను పూర్తి చేస్తున్నారు. అన్నాత్తేలో కోలీవుడ్ సూపర్ స్టార్ చెల్లెలిగా కనిపించిన కీర్తి.. త్వరలో టాలీవుడ్ మెగాస్టార్ సిస్టర్ గా సందడి చేయనుంది. అయితే ఆచార్య రిజల్ట్ కారణంగా భోళాశంకర్ పలు మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Upcoming Movies: ఒక్క టీజర్.. శాంపిల్‌తోనే సినిమా చూపించేస్తున్న మేకర్స్!

నందమూరి బాలకృష్ణ, శ్రీలీల కూడా స్క్రీన్ చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే బాలయ్య చెల్లెలిగా కాదు… కూతురుగా శ్రీలీల నటిస్తుందని సమాచారం. గోపీచంద్ మలినేని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ నటించబోతున్నారు. ఈ సినిమాలోనే ఆయనకు 20 ఏళ్ల కూతురిగా శ్రీలీల కనిపించబోతున్నట్టు చెప్తున్నారు. అయితే త్వరలోనే ఇది నిజమా కాదా అన్నది తేలిపోతుంది. ఎందుకంటే రాబోయే కొన్ని రోజుల్లోనే బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కనుంది.