Upcoming Movies: ఒక్క టీజర్.. శాంపిల్‌తోనే సినిమా చూపించేస్తున్న మేకర్స్!

పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. భారీ స్టార్ కాస్ట్ తో.. భారీ బడ్జెట్ తో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మెగా మూవీస్ అన్నీ జస్ట్ శాంపిల్ చూపిస్తూనే ఆడియన్స్..

Upcoming Movies: ఒక్క టీజర్.. శాంపిల్‌తోనే సినిమా చూపించేస్తున్న మేకర్స్!

Upcoming Movies

Upcoming Movies: పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. భారీ స్టార్ కాస్ట్ తో.. భారీ బడ్జెట్ తో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మెగా మూవీస్ అన్నీ జస్ట్ శాంపిల్ చూపిస్తూనే ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీడియోలు, టీజర్లతోనే సినిమా ఇంటెన్సిటీ ని చూపిస్తూ.. సినిమా మీద హైప్స్ రోజురోజుకీ పెంచేస్తున్నాయి.

KGF2: రాకింగ్ స్టార్ సవాల్.. తుఫాన్‌ను తట్టుకోగలరా?

సినిమాలు స్పీడందుకున్నాయి. చిన్న సినిమా సీజన్ కంప్లీట్ అయ్యి పెద్ద సినిమాలు వరస పెట్టి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందుకే.. మెగా మూవీస్ అన్నీ బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. రోజుకో అప్ డేట్, వారానికో వీడియో తోసినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన కెజిఎఫ్ 2 నుంచి , నాని దసరా టీజర్ వరకూ మూవీ ఇంటెన్సిటీని చూపిస్తున్నాయి.

KGF2: తుఫాన్ దెబ్బకు కొట్టుకుపోయిన రికార్డులు!

కెజిఎఫ్ 2.. సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియాలోనే మోస్ట్ అవెయిటింగ్ మూవీ. ఈ క్రేజీ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కు రెడీ అవుతోంది. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమాకు సంబందించి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యష్ హీరోగా చేసిన ఈ రివేంజ్ యాక్షన్ డ్రామా నుంచి తూఫాన్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

ఒక్క సాంగ్ తోనే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ దెబ్బకి పెరిగిపోయాయి. సెకండ్ పార్ట్ ను చూసినవాళ్లకు ఫస్ట్ పార్ట్ టీజర్ లాగా కనిపిస్తుందంటూ సినిమా మీద హైప్స్ పెంచేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2లో యష్ ని ఫస్ట్ పార్ట్ లో కన్నా పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు. నరాచి బంగారు గనుల్లో కష్టపడుతున్న వాళ్లని రిలీజ్ చేయించడానికి, తన గోల్ ని రీచ్ కావడానికి రాకీ భాయ్.. తన పవర్ ని మొత్తం చూపిస్తూ, రాజకీయంగా కూడా ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదుర్కుంటూ ఎలా గెలిచాడో అదే సినిమా స్టోరీ అంటున్నారు జనాలు.

Sarkaru Vaari Paata: సెంచరీ కొట్టిన కళావతి.. మహేష్ స్టెప్స్‌కు జనం ఫిదా!

మరో స్టార్ హీరో మూవీ సర్కారు వారి పాట కూడా జస్ట్ ఒక్క పాటతోనే సినిమా మొత్తం రివీల్ చేసేశారు. మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ తోనే.. సినిమాలో అంతా మనీ మేటరే అని అర్దమైపోయింది జనాలకి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ తో అసలు మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్.

Sarkaru Vaari Paata: పైసా వసూల్ అప్‌డేట్‌తో వస్తున్న ‘సర్కారు వారి పాట’

మహేష్ బాబు.. సర్కారు వారి పాటలో రికవరీ ఏజెంట్ అని క్లియర్ గా తెలుస్తోంది. రికవరీ అంటే ఏదో ఇచ్చిన డబ్బులు తీసుకుని తర్వాత ఇస్తామంటే వెళ్లిపోయే టైప్ కాదు.. డబ్బులు చెక్కెయ్యాలని చూస్తే.. చుక్కలు చూపించే టైప్. వడ్డీ లెక్కలు కాస్తా అటూ ఇటూ అయినా శాల్తీలు లేపేసే లెక్క అంటూ క్లియర్ కట్ వార్నింగ్ లు ఇస్తున్నారు మహేష్. ఇలా సర్కారు వారి పాటలో రికవరీ ఏజెంట్ గా తేడా వస్తే.. తనకు రావల్సిన డబ్బుకోసం ఎంతకైనా తెగించే హీరో సినిమాయే సర్కారు వారి పాట.

Dasara: ఊరమాస్ నానీ.. కెవ్వు కేక ‘స్పార్క్ ఆఫ్ దసరా’ గ్లిమ్ప్స్!

ఇన్నాళ్లూ లవర్ బాయ్ గా, పక్కింటబ్బాయిగా కనిపించిన నాని.. ఫస్ట్ టైమ్ నిప్పుతో చెలగాటం అడుతున్నాడు. క్యూట్ గా స్వీట్ గా కనిపించిన నాని.. ఇప్పుడు డీ గ్లామరైజ్డ్ రస్టిక్ లుక్ లో మాస్ ఫైట్ కి రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కుతున్న దసరా సినిమాలో నాని తన లోని మాస్ యాంగిల్ చూపించబోతున్నాడు.

Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్

కంప్లీట్ తెలంగాణ యాసలో బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కుతున్న దసరా మూవీలో తమహక్కుల కోసం పోరాడే నాయకుడిగా ధరణి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారునాని. ఇప్పటికే రిలీజ్ అయ్యిన టీజర్ లో ఏమాత్రం భయంలేని వాడిగా కాన్ఫిడెంట్ క్యారెక్టర్ చేస్తున్న నాని.. బొగ్గు గనుల కార్మికుడిగా తమ పై జరుగుతున్న అన్యాయాల్ని నిలదియ్యడానికి రెడీ అయ్యారు.

Beast: కేజీఎఫ్-2తో యుద్ధానికి సిద్ధమైన బీస్ట్!

కంప్లీట్ యాక్షన్ టైనర్ అని టైటిల్ తోనే హింట్ ఇచ్చిన బీస్ట్.. ఈ సినిమాలో యాక్షనేకాదు.,. రొమాన్స్ కూడా కావల్సినంత ఉందని చెబుతున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బీస్ట్ లో అరబిక్ కుతు సాంగ్ సెన్సేషన్ ఇంకా కంటిన్యూ అవుతుండగానే.. లేటెస్ట్ గా జాలీ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఫుల్ పార్టీ మూడ్ లో ఎంజాయ్ చేస్తున్న పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గన్సే కాదు.. గర్ల్స్ విత్ రొమాన్స్ కూడా ఉందని చెప్పకనే చెబుతున్నారు విజయ్.