Sarkaru Vaari Paata: పైసా వసూల్ అప్‌డేట్‌తో వస్తున్న ‘సర్కారు వారి పాట’
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’కు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు.....

Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’కు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ మొదలుకొని, రీసెంట్‌గా రిలీజ్ అయిన కళావతి సాంగ్ వరకు అన్ని కూడా అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలోని సెకండ్ సాంగ్‌కు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ సడెన్ అప్‌డేట్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.
Sarkaru Vaari Paata: క్లైమాక్స్‌కు చేరిన సర్కారు షూటింగ్.. నెక్స్ట్ రచ్చ మహేష్‌దే!
సర్కారు వారి పాట చిత్రంలోని సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మార్చి 17న అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సెకండ్ సాంగ్ అప్‌డేట్ ఖచ్చితంగా పైసా వసూల్‌లా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అభిమానుల్లో అప్పుడే ఆసక్తి క్రియేట్ అయ్యింది. సర్కారు వారి పాట నుండి తొలి సాంగ్‌గా ఓ రొమాంటిక్ మెలోడి పాటను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, సెకండ్ పాటగా మాస్ సాంగ్‌ను రిలీజ్ చేస్తుందా అని ఆతృతగా చూస్తున్నారు ఆడియెన్స్.
కాగా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా థమన్ సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా మారనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
Sarkaru Vaari Paata: అటు షూటింగ్.. ఇటు ప్రమోషన్.. ఫ్యాన్స్‌కి మహేశ్ సూపర్ ట్రీట్
ఇక ఈ సినిమా నుండి రాబోతున్న రెండో పాట ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందా, అసలు ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అనే అంశాలు తెలియాలంటే ఈ పాట రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Get ready for the Paisa Vasool update ???#SarkaruVaariPaata Second Single announcement tomorrow?#SVPOnMay12
Super? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/ln6ld8mTVf
— GMB Entertainment (@GMBents) March 16, 2022