KGF2: రాకింగ్ స్టార్ సవాల్.. తుఫాన్‌ను తట్టుకోగలరా?

మార్చ్ తూఫానే ఇలా ఉంటే.. ఏప్రిల్ తుఫాన్ బీభత్సమే అంటున్నారు కెజిఎఫ్ ఫ్యాన్స్. సాంగ్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న రాఖీబాయ్.. కెజిఎఫ్ పార్ట్ 2తో రికార్డ్స్ కొల్లగొట్టడం..

KGF2: రాకింగ్ స్టార్ సవాల్.. తుఫాన్‌ను తట్టుకోగలరా?

Kgf2

KGF2: మార్చ్ తూఫానే ఇలా ఉంటే.. ఏప్రిల్ తుఫాన్ బీభత్సమే అంటున్నారు కెజిఎఫ్ ఫ్యాన్స్. సాంగ్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న రాఖీబాయ్.. కెజిఎఫ్ పార్ట్ 2తో రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయమనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ తో హీరో యశ్ ఇచ్చిన కిక్.. పాన్ ఇండియా లెవెల్లో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చూస్తే ఒక్క పాటతో మిగిలిన హీరోలకు సవాల్ విసిరేలా.. సినిమాకు ఎవరూ అడ్డు నిలబడే థైర్యం చేయకుండా తిరిగొచ్చాడు రాకింగ్ స్టార్.

KGF2: తుఫాన్ దెబ్బకు కొట్టుకుపోయిన రికార్డులు!

ఒక్క పాటతో చెమటలు పట్టించాడు రాకింగ్ స్టార్. టీజర్ తర్వాత రాకరాక వచ్చిన కేజీఎఫ్ తుఫాన్ సాంగ్.. నిజంగానే పాన్ ఇండియా లెవెల్ లో తుఫాన్ సృష్టిస్తోంది. సాంగ్ ఇంట్రో డైలాగ్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించిన మేకర్స్.. పూర్తి పాటతో పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు. ప్రశాంత్ నీల్ సాలిడ్ డైరెక్షన్లో.. యశ్ రగ్డ్ లుక్ కి తోడూ.. రవి బస్రూర్ మ్యూజిక్.. రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్.. వేరే లెవెల్ తూఫాన్ లో ఫ్యాన్స్ విజృంభించేలా చేస్తున్నాయి.

KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

పెద్ద అంచనాలు లేకుండా దేశమంతా రిలీజై.. బాక్సాఫీస్ సునామీని సృష్టించింది కేజీఎఫ్ పార్ట్1. ఈ సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి హీరో యశ్.. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించుకున్నాడు. రాకింగ్ స్టార్ గా కోట్లమంది అభిమానుల్ని సంపాదించి కేజీఎఫ్ సీక్వెల్ కోసం వెయిట్ చేయిస్తున్నాడు. మూడున్నరేళ్ల నుంచి ఈ మూవీ పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్ కి టీజర్ తోనే బ్లాక్ బస్టర్ ట్రీట్ ఇచ్చాడు. సీక్వెల్ పై అంచనాలు పెంచేలా సాలిడ్ లుక్ లో కనిపించాడు.

Vijay: మెగా క్లాష్.. కేజీఎఫ్2తో బీస్ట్ వార్..?

ఇప్పుడేమో తూఫాన్ పాటతో ఏప్రిల్ 14న రికార్డుల మోతే అన్న హింట్ వదిలాడు రాకింగ్ స్టార్. నేషనల్ వైడ్ స్టార్ హీరోలకు స్టైయిట్ గా సవాల్ విసురుతున్నాడు. మాస్ అండ్ డైనమిక్ లుక్స్ లో ఎనర్జీ బాంబ్ లా కనిపిస్తోన్న మాస్ అవతార్ యశ్ ను తట్టుకోవాలంటే అంతకుమించి అన్నలెవెల్ లో హీరోలు పోటీకి దిగాలనేది ఫ్యాన్స్ వర్షన్. అప్పుడే ఫ్యూచర్ లో యశ్ ని మించే సాలిడ్ హీరోను చూడొచ్చంటున్నారు. ఇంతకీ ఏప్రిల్ 13న వస్తానంటున్న కోలీవుడ్ స్టార్ విజయ్ బీస్ట్ తో అనుకున్నట్టే రంగంలోకి దిగుతాడా… యశ్ సృష్టించిన తూఫాన్ కి ఆలోచన మార్చుకుంటాడా అన్నది ముందు ముందు తెలుస్తోంది.