KGF2: తుఫాన్ దెబ్బకు కొట్టుకుపోయిన రికార్డులు!

కన్నడ హీరో యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’ కోసం ఆడియెన్స్ ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ తొలి భాగం అందుకున్న భారీ సక్సెస్‌తో.....

KGF2: తుఫాన్ దెబ్బకు కొట్టుకుపోయిన రికార్డులు!

Toofan Song From Kgf2 Creates New Record (1)

KGF2: కన్నడ హీరో యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’ కోసం ఆడియెన్స్ ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ తొలి భాగం అందుకున్న భారీ సక్సెస్‌తో కేజీఎఫ్ చాప్టర్ 2పై అటు చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం మాస్, క్లాస్ వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఇప్పుడు సీక్వెల్ చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్. తాజాగా సినిమాలోని ‘తుఫాన్’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

KGF 2: తూఫాన్ అలర్ట్ ఇచ్చిన కేజీఎఫ్ 2!

ఈ లిరికల్ వీడియో సాంగ్ సరికొత్తగా ఉండటం, ఈ సినిమా కోసం ఆల్రెడీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఉండటంతో ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ పాట రిలీజ్ అయిన 24 గంటల్లో 5 భాషల్లో కలిపి అత్యధిక మంది వీక్షించిన పాటగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తుఫాన్ లిరికల్ వీడియో సాంగ్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 26 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను దక్కించుకుని ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. అంతేగాక ఈ లిరికల్ సాంగ్‌కు 2 మిలియన్ ప్లస్ లైకులు కూడా దక్కాయి. ఇలా తొలి లిరికల్ సాంగ్‌తోనే కేవలం 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా తుఫాన్ రికార్డు క్రియేట్ చేయడంతో ఇప్పుడు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.

KGF 2: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!

యశ్ మాస్ లుక్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కాగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కథను నెరేట్ చేసే విధానం మరో హైలైట్‌‌గా నిలవనుంది. యశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన హీరో ఎలివేషన్స్, ఆకట్టుకునే సంగీతంతో ప్రేక్షకులకు కేజీఎఫ్ 2 చిత్రం మరోసారి ఖచ్చితంగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో యశ్ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ రవీనా టండన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను భారీ బడ్జెత్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.