KGF 2: తూఫాన్ అలర్ట్ ఇచ్చిన కేజీఎఫ్ 2!

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి భారీ విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు ప్రశాంత్ నీల్...

KGF 2: తూఫాన్ అలర్ట్ ఇచ్చిన కేజీఎఫ్ 2!

Toofan Lyrical Video Song From Kgf 2 Locks Date

KGF 2: కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి భారీ విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం యూనివర్సల్ సబ్జెక్ట్‌తో రావడంతో ఈ సినిమా ఇతర భాషల్లోని ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ మలిచిన తీరు అద్భుతంగా ఉండటం, సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ భారీగా ఉండటంతో మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశారు. ఇదే ఈ సినిమాకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో ఈ చిత్రానికి మరో పవర్‌‌ఫుల్ సీక్వెల్ చిత్రం కూడా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.

KGF 2: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!

దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులు అన్నీ పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ మాత్రం కాలేదు. వరుసగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని ఈ వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇప్పటివరకు కేవలం హీరో పాత్రకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు మాత్రమే రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఆ తరువాత విలన్‌గా నటిస్తున్న సంజయ్ దత్ లుక్‌ను కూడా రివీల్ చేసింది. అయితే తాజాగా తూఫాన్ అనే తొలి లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ మార్చి 21న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో మురికివాడల్లో ఉంటూ, బొగ్గు గనుల్లో పనిచేసే పిల్లలు పోజిచ్చి నిలబడ్డ తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మైనింగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యశ్ ‘రాఖీ భాయ్’ అనే పాత్రలో నటిస్తున్నాడు.

KGF2 : ‘కేజీఎఫ్‌ 2’లో ఐటెం సాంగ్ ఇదేనా??

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో సంజయ్ దత్ లుక్ కూడా చాలా వెరైటీగా ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా తొలి భాగంలాగే భారీ విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ భామ రవీనా టండన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. హొంబాలే ఫిలింస్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.