Sandeep Reddy Vanga : ఇదెక్కడి కాంబోరా మామ.. ఈ ఇద్దరితో సినిమా ప్రకటించిన సందీప్ రెడ్డి వంగ..
తాజాగా సందీప్ రెడ్డి ఓ కొత్త సినిమాని ప్రకటించాడు. (Sandeep Reddy Vanga)
Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాలంటే ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. ఒక సరికొత్త హీరో యాటిట్యూడ్ తో అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు తీసి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు సందీప్ రెడ్డి. ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా సందీప్ రెడ్డి ఓ కొత్త సినిమాని ప్రకటించాడు.
కానీ ఈ సారి దర్శకుడిగా కాదు నిర్మాతగా. సందీప్ రెడ్డి వంగ నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై రోమాంచకం అనే కొత్త సినిమాని నేడు ప్రకటించాడు. మేము ఫేమస్, గోదారి గట్టు పైన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా, 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో నేడు ఈ సినిమాని ప్రకటించారు.
Also Read : Jagapathi Babu : అందులో నా సీన్స్ తగ్గించారు.. పుష్ప 3 అప్డేట్ ఇచ్చిన జగపతి బాబు..
ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ సందీప్ రెడ్డి వంగ తన ట్విట్టర్ లో.. ఈ సినిమా నేరేషన్ విన్నపుడు నేను మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. కామెడీనే కాకుండా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉంది. నేను మొదటిసారి ఒక సినిమాని ప్రజెంట్ చేస్తున్నాను. భద్రకాళి పిక్చర్స్ ఒక సరికొత్త మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ సినిమాతో రాబోతుంది అని తెలిపాడు. సందీప్ రెడీ వంగ లవ్, కామెడీ సినిమా నిర్మిస్తున్నాడు అని ప్రకటించడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
I had a heartfelt laugh throughout the narration. Beneath all the fun, there’s a strong emotional tact, and for the first time, I’m presenting the film.
Glad to announce that BHADRAKALI PICTURES is coming out with a very unique musical romantic comedy.#Romanchakam… pic.twitter.com/DpYHUVRYlK— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 29, 2026
