Vijay: మెగా క్లాష్.. కేజీఎఫ్2తో బీస్ట్ వార్..?

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా.....

Vijay: మెగా క్లాష్.. కేజీఎఫ్2తో బీస్ట్ వార్..?

Vijay Beast To Fight Kgf 2 At Box Office

Vijay: తమిళ స్టార్ హీరో ఇళయదళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో మరోసారి తమిళ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Beast : విజయ్ సినిమా కోసం శివ కార్తికేయన్ పాట

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే బీస్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో పాన్ ఇండియా మూవీతో వార్‌కు రెడీ అయినట్లు కనిపిస్తుంది. కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రం ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను కూడా వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఇక ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా విజయ్ నటించిన బీస్ట్ చిత్రాన్ని ఏప్రిల్ 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద బీస్ట్ వర్సెస్ కేజీఎఫ్2 పోటీ ఖాయంగా మారింది. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కరోనా ప్రభావంతో సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయిందని, ఇప్పుడు ఇలా ఒకేసారి రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యి కలెక్షన్స్‌పై ప్రభావం చూపడం మంచిది కాదని వారు అంటున్నారు.

KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదైనా ఒకటి తమ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు చేసుకోవడం బెటర్ అంటున్నారు. మరి బీస్ట్ వర్సెస్ కేజీఎఫ్ పోటీలో ఏ సినిమా వెనకడుగు వేస్తుందా.. లేక రెండు సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతాయా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.