Beast : విజయ్ సినిమా కోసం శివ కార్తికేయన్ పాట

తాజాగా ఇప్పుడు విజయ్ 'బీస్ట్' సినిమా కోసం అరబిక్​ టచ్​తో 'అరబిక్​ కుతు' సాంగ్ ని రాశాడు శివ కార్తికేయన్. నిన్న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పాట రిలీజ్ అయింది. తమిళ పాటకి....

Beast : విజయ్ సినిమా కోసం శివ కార్తికేయన్ పాట

Vijay

 

Siva Karthikeyan :  మన హీరోలు చాలా మంది మల్టీట్యాలెంటెడ్. ఒకపక్క హీరోగానే చేస్తూ అవసరమైతే రైటింగ్, డైరెక్షన్, కొరియోగ్రఫీ.. లాంటి వాటిల్లో కూడా తమ సత్తాని చూపిస్తారు. ఇలా చాలా మంది హీరోలు తమ ట్యాలెంట్స్ ని బయట పెడుతున్నారు. అయితే ఇది వారి సినిమాలకే కాకుండా తమ తోటి హీరోల సినిమాల కోసం కూడా పని చేస్తున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ సినిమా కోసం మరో తమిళ్ స్టార్ హీరో పాటని రాశాడు.

జూనియర్ ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్ నుంచి కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు శివకార్తికేయన్​. శివ కార్తికేయన్ కి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. ఇటీవలే ‘డాక్టర్’ సినిమాతో భారీ విజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. శివ కార్తికేయన్ హీరోగానే కాక నిర్మాతగా, సింగర్​గా, గేయ రచయితగా ఇప్పటికే తనను తానూ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికే నయనతార కొలమావు కోకిల సినిమాలో ‘కళ్యాణ వయసు’ సాంగ్​, డాక్టర్ సినిమాలో ‘చెల్లమ్మ, సో బేబీ’, సూర్య ఈటి సినిమాలో ‘సుమ్మ సుర్రును’ లాంటి మరెన్నో పాటలు రాశాడు. తాజాగా ఇప్పుడు విజయ్ ‘బీస్ట్’ సినిమా కోసం అరబిక్​ టచ్​తో ‘అరబిక్​ కుతు’ సాంగ్ ని రాశాడు శివ కార్తికేయన్.

Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

నిన్న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పాట రిలీజ్ అయింది. తమిళ పాటకి అరబిక్ పదాలు జత చేసి మంచి క్యాచీ సాంగ్ ని ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పాట తమిళ్ లో బాగా పాపులర్ అవుతుంది. ‘బీస్ట్’ సినిమా డైరెక్టర్ తోనే శివ కార్తికేయన్ ‘డాక్టర్’ సినిమా చేశాడు. ఇక అనిరుద్ తో శివకి మంచి అనుబంధం ఉంది. వీరితో ఉన్న స్నేహం కారణంగానే దర్శకుడు నెల్సన్ అడగగానే ఈ పాటా రాశాడు శివ కార్తికేయన్. శివ కార్తికేయన్ పాట అద్భుతంగా రాశాడని అభిమానులు, ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా అభినందిస్తున్నారు. మరో స్టార్ హీరో కోసం శివ కార్తికేయన్ ఇంత మంచి పాటని ఇచ్చినందుకు పొగిడేస్తున్నారు ప్రేక్షకులు.

Kerala : నిన్న శబరిమల నేడు గురువాయర్.. డోలీ మోసిన వారికి దండం పెట్టిన చిరంజీవి

ఈ సాంగ్​ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్​ను సినీ గేయ రచయిత, దివంగత ముత్తుకుమార్ కుటుంబానికి అందజేసి మంచి మనసు చాటుకున్నాడు నటుడు శివకార్తికేయన్​. ఈ మంచి పనితో ఈ యంగ్​ హీరోను మరోసారి పొగిడేస్తున్నారు. ఇక నెల్సన్ డైరెక్షన్ లో విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానుంది.