Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మాస్ రాజా రవితేజ ఇప్పుడు దూకుడు సినిమాలు పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఫిబ్రవరి 11న ఖిలాడీ సినిమా విడుదల కాగా.. మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది.

Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

Dhamaka

Dhamaka: సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మాస్ రాజా రవితేజ ఇప్పుడు దూకుడు సినిమాలు పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఫిబ్రవరి 11న ఖిలాడీ సినిమా విడుదల కాగా.. మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. ఇప్పటికే నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ అందులో ధమాకా సినిమాని సూపర్ ఫాస్ట్ లో కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయిన ఈ సినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

DJ Tillu: ఈ ఏడాది ఇప్పటి వరకు సినిమాల్లో టాప్ టిల్లుగాడే!

వాలెంటైన్స్ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రేమికుల రోజు కావడంతో రవితేజ, శ్రీలీల జంటగా ఉన్న పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో రవితేజ యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తుండగా, శ్రీలీల క్యూట్ గా కనిపిస్తోంది. వారిద్దరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల పాత్ర పేరు ప్రణవి. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా సిద్దమవుతుంది.

Radhe Shyam Glimpse: ఇంతమంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు!

డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్తో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు వర్క్ చేస్తున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్ గా వ్యవహరించనున్నారు.