DJ Tillu: ఈ ఏడాది ఇప్పటి వరకు సినిమాల్లో టాప్ టిల్లుగాడే!

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజే టిల్లు’. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భీమ్లా నాయక్ లాంటి భారీ సినిమాని తెరకెక్కించే సితార ఎంటర్ టైన్..

DJ Tillu: ఈ ఏడాది ఇప్పటి వరకు సినిమాల్లో టాప్ టిల్లుగాడే!

Dj Tillu

DJ Tillu: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజే టిల్లు’. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భీమ్లా నాయక్ లాంటి భారీ సినిమాని తెరకెక్కించే సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శనివారం ఫిబ్రవరి 12న భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా చిన్న సినిమాగా మొదలై భారీ వసూళ్లని సాధిస్తుంది. ముందు నుంచి ‘డిజే టిల్లు’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Bheemla Nayak: ఏప్రిల్‌కు విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?

విడుదలకి ముందే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ యూత్ ని బాగా ఆకట్టుకోగా.. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని అంచనాలు క్రియేట్ చేసింది. సినిమా ప్రమోషన్స్ ని కూడా ఎక్కడా తగ్గకుండా భారీ సినిమా లెవల్లో చేశారు నిర్మాతలు. అలా థియేటర్లలోకి వచ్చిన టిల్లు గాడు ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో భారీ వసూళ్లని సాధించిన సినిమాగా బాక్సాపీస్ వద్ద డీజే మోగిస్తున్నాడు.

Gurthunda Seethakalam Trailar: చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. శీతాకాలం!

రిలీజ్ రోజే సినిమాపై వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో మొదటి రెండు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను సాధించిందనే వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకున్న డీజే టిల్లు సిద్ధూ కేరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా మారింది. ఈ ఏడాదిలో డీజే టిల్లుకి ముందు వచ్చిన సినిమాల్లో బంగార్రాజు సినిమా టాప్. దాదాపుగా 50 కోట్ల వసూళ్లు దక్కించుకున్న బంగార్రాజు అప్పుడు ఈ ఏడాది టాప్ వసూళ్లుగా రికార్డ్ సెట్ చేశాడు.

F3 Movie: ఎఫ్3 మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?

ఇప్పుడు ఆ రికార్డును ఓపెనింగ్స్ విషయంలో డీజే టిల్లు క్రాస్ చేసినట్లు తెలుస్తుండగా ఈ వారం రిలీజ్ అయిన మిగతా సినిమాలు రెండో రోజుకే కలెక్షన్లు డ్రాప్ అయినా టిల్లు సినిమాకి వీకెండ్ పర్ఫెక్ట్ సినిమాగా ప్రేక్షకులను థియేటర్లకి రప్పించింది. మరో వారం రోజుల పాటు ఈ సినిమాకి ఇదే కలెక్షన్లు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా.. అదే జరిగితే సిద్ధూ కెరీర్ లోనే ఇది బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోవడం ఖాయం.