Gurthunda Seethakalam Trailar: చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. శీతాకాలం!

సత్యదేవ్-తమన్నా హీరో హీరోయిన్లు వస్తోన్న లేటెస్ట్ సినిమా గుర్తుందా శీతాకాలం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాగా..

Gurthunda Seethakalam Trailar: చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. శీతాకాలం!

Gurthunda Seethakalam Trailar

Updated On : February 14, 2022 / 12:00 PM IST

Gurthunda Seethakalam Trailar: సత్యదేవ్-తమన్నా హీరో హీరోయిన్లు వస్తోన్న లేటెస్ట్ సినిమా గుర్తుందా శీతాకాలం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాగా.. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. గుర్తుందా శీతాకాలం టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమాని రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కినట్లు తెలుస్తుంది.

F3 Movie: ఎఫ్3 మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?

శీతాకాలం.. మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం.. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం అంటూ సత్యదేవ్ వాయిస్ తో మొదలయ్యే ఈ ట్రైలర్ లో సత్యదేవ్ పాత్ర గురించి.. తన ప్రేమ కథల గురించి చెప్తూ ఈ ట్రైలర్ సాగిపోతుంది. స్కూల్ డేస్ లో కోమలి.. కాలేజ్ డేస్ లో అమ్ము.. జర్నీలో దివ్య.. ఫైనల్ గా నిధీ అంటూ సత్యదేవ్ తన వయసు పెరిగేకొద్దీ ప్రేమలో ఎలా పడ్డాడో ట్రైలర్ లో చెప్పేస్తాడు. ప్రేమకథలు ఇన్ని ఉన్నా అందంగా చూపించడమే ఈ ట్రైలర్ స్పెషాలిటీ. ట్రైలర్ ఆద్యంతం అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

Bheemla Nayak: మరో సాంగ్ లీక్.. నిన్న మహేష్ నేడు పవన్!

కీరవాణి కుమారుడు కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. ఓ కన్నడ సినిమాకు ఇది రీమేక్‌గా వస్తుంది. కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్న ఈ సినిమా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ లోనే అర్ధమవుతుండగా సినిమా ఎలా ఉండబోతుందోనని ట్రైలర్ అంచనాలను పెంచేసింది.