F3 Movie: ఎఫ్3 మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?

ఒక మాములు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్ 2 భారీ విజయం సాధించడంతో మేకర్స్ ‘ఎఫ్3’ కూడా సెట్ చేశారు. అనుకున్నట్లుగానే షూటింగ్ మొదలు పెట్టారు కానీ.. 2021 సంక్రాంతికే..

F3 Movie: ఎఫ్3 మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?

F3 Movie

F3 Movie: ఒక మాములు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్ 2 భారీ విజయం సాధించడంతో మేకర్స్ ‘ఎఫ్3’ కూడా సెట్ చేశారు. అనుకున్నట్లుగానే షూటింగ్ మొదలు పెట్టారు కానీ.. 2021 సంక్రాంతికే రావాల్సిన ఎఫ్3 కరోనా కారణంగా వాయిదా పడుతూ వాచ్చింది. ఒకపక్క షూటింగ్ కు అంతరాయంతో పాటు రిలీజ్ డేట్ ప్రకటించడం.. అప్పటికి పరిస్థితులు కారణంగా వాయిదా పడడం జరుగుతూ వస్తుంది. కరోనా పోయి కొత్త డేట్స్ ఇవ్వడంతో ఈసారి మార్చిలోనే వచ్చేస్తున్నాం ఇదే ఫైనల్ అని ప్రకటిచారు.

Hello Guru Prema Kosame: రామ్ సినిమాకి హిందీలో భారీ రెస్పాన్స్!

కానీ, ఇప్పుడు మార్చి డేట్ కూడా మరోసారి మార్చుకొని మళ్ళీ వాయిదా పడింది. ఏప్రిల్ 28న విడుదల కానున్నట్టు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది. కాగా, ఇప్పుడు ఆ డేట్ మార్చుకొని మే నెలకి వాయిదా వేశారు. పిల్లలు పరీక్షలు ముగించుకొని రండి.. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి.. ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం అంటూ మే 27న తమ సినిమా రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Bheemla Nayak: మరో సాంగ్ లీక్.. నిన్న మహేష్ నేడు పవన్!

ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల కానుంది. ఆచార్య టీం రిలీజ్ డేట్ ప్రకటించాక కూడా ఎఫ్ 3 సినిమాను ఒకరోజు ముందే ఏప్రిల్ 28న ఎఫ్3 విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు. ఆచార్య నైజాం హక్కులు కొన్న ఓ డిస్టిబ్యూటర్ తో దిల్ రాజు వార్ కారణంగానే ఎఫ్ 3ని ఏప్రిల్ లో తీసుకురావాలని చూస్తున్నారని ఇండస్ట్రీలో ఒక టాక్ నడిచింది. ఫైనల్ గా ఇది సద్దుమణిగి దిల్ రాజే వెనక్కి తగ్గి ఆచార్యకి సైడ్ ఇచ్చేసినట్లుగా కనిపిస్తుంది.