KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో కేజేఎఫ్ 2 కూడా ఒకటి. అంచనాలు లేకుండా వచ్చి ‘కేజీఎఫ్‌’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.

KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

Kgf2

KGF2: మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో కేజేఎఫ్ 2 కూడా ఒకటి. అంచనాలు లేకుండా వచ్చి ‘కేజీఎఫ్‌’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోతే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. ఇప్పుడు అంతా ఈ సినిమా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ లో ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ కన్నడ సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది.

Srikanth Addala: బాలయ్యతో క్లాస్ దర్శకుడి కథా చర్చలు.. సెట్టయ్యేనా?

కేజేఎఫ్ ఫస్ట్ పార్ట్ లో కూడా ఐటెం సాంగ్ అంతే స్పెషల్ అట్రాక్షన్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా ‘కేజీఎఫ్‌ 2’లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ‘కేజీఎఫ్‌ 1’ హిందీ వర్షన్ లో ‘త్రిదేవ్‌’ సినిమాలోని జాకీ ష్రాఫ్‌, సోనమ్‌ ఆడి పాడిన ‘గలీ గలీ మే’ పాటను రీమిక్స్‌ చేయగా.. ఇందులో హిందీ బుల్లితెర బ్యూటీ మౌనీ రాయ్‌ స్టెప్పులేసింది. తెలుగులో మాత్రం ‘దోచెయ్‌..’ అంటూ తమన్నాతో ఐటమ్‌ సాంగ్‌ చేయించారు.

Divyanka Tripathi: డైరెక్టర్‌తో ఒక రాత్రి గడిపితేనే సీరియల్ ఆఫర్!

అలాగే ఇప్పుడు ‘కేజీఎఫ్‌ 2’ సినిమాకి కూడా హిందీ సూపర్‌ హిట్‌ ఐటెం సాంగ్‌ను రీమిక్స్‌ చేశారని సమాచారం. మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర కలిసి నటించిన షోలే సినిమాలోని ‘మెహబూబా.. మెహబూబా..’ సాంగ్‌ అప్పట్లో దేశమంతా ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు ఆ పాటను కేజేఎఫ్2 కోసం రీమేక్ చేశారని తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే స్టెప్పులేసిందని.. అనన్య హాట్ డాన్స్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఇతర సౌత్ బాషలలో కూడా అనన్యతోనే చేయిస్తారా లేక ఇక్కడ మరెవరితోనైనా చేయిస్తారా చూడాలి.