Divyanka Tripathi: డైరెక్టర్‌తో ఒక రాత్రి గడిపితేనే సీరియల్ ఆఫర్!
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలను చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Divyanka Tripathi
Divyanka Tripathi: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలను చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మీ టూ అంటూ దీనిపై గతంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే నడించింది. అయితే.. మీ టూ కన్నా ముందే తనకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని.. హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన దివ్యాంక తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
OTT Release: ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలివే!
ఒక సీరియల్ లేదా షో పూర్తి చేశాక నటులకు అసలైన కష్టం మొదలవుతుందని.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుందని.. తనకు కూడా అలాగే ఒకసారి బిల్స్, ఈఎమ్‌ఐ కూడా కట్టలేని స్థితిలో.. చేతిలో డబ్బుల్లేక ఇంకా సరైన ఆఫర్లు రాక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఒక ఆఫర్ వచ్చిందని.. తీరా అక్కడకి వెళ్ళాక.. నువ్వు డైరెక్టర్‌తో ఒక రాత్రంతా గడిపితే నీకు మంచి అవకాశం ఇస్తాడని ఒక వ్యక్తి చెప్పడంతో షాక్ తిన్నానని చెప్పుకొచ్చింది.
Allu Arjun-Rajamouli: బన్నీతో జక్కన్న.. క్రేజీ కాంబో సెట్టయినట్లే!
ఇలాంటి ఆఫర్స్ ఇచ్చేవారు ఇండస్ట్రీలో ఇదంతా సర్వసాధారణం అని మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారని.. వాళ్లు మన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరింపులకు దిగుతారని.. అయితే, మీరు దానికి అంగీకరించకపోతే కెరీర్‌లో పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని.. తాను కూడా వారి ఆఫర్లకు, బెదిరింపులకు లొంగకుండా.. ఆ అంశాన్ని కూడా సీరియస్‌గా తీసుకోకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోయానని చెప్పింది.