Allu Arjun-Rajamouli: బన్నీతో జక్కన్న.. క్రేజీ కాంబో సెట్టయినట్లే!

ఊహించని విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అయిపోయాడు. అసలు ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో ఇండియా..

Allu Arjun-Rajamouli: బన్నీతో జక్కన్న.. క్రేజీ కాంబో సెట్టయినట్లే!

Allu Arjun Rajamouli

Updated On : January 31, 2022 / 11:24 AM IST

Allu Arjun-Rajamouli: ఊహించని విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అయిపోయాడు. అసలు ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో ఇండియా వైడ్ పుష్ప సినిమా కాసుల వర్షం కురిపించేసింది. పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక.. దర్శక ధీరుడు జక్కన్న గురించి చెప్పేదేముంది. ఎప్పుడో బాహుబలితోనే ఆయన ప్రపంచం మెచ్చిన దర్శకుడిగా అవతరించాడు. మరి ఈ కాంబినేషన్ లో సినిమా పడితే ఎలా ఉంటుంది?

Deepika-Alia: ఇదేం పని.. మగాళ్ల బాత్రూమ్ లో దీపికా.. అలియా!

అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా గురించి ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు. గతంలో మగధీర సినిమా తర్వాత బన్నీతో సినిమా చేస్తాడని కథనాలొచ్చాయి. కానీ.. ఎందుకో అది సెట్ కాలేదు. మగధీర సమయంలోనే గీత ఆర్ట్స్ తో రాజమౌళికి విబేధాలని ఏవో కథనాలొచ్చాయి. అప్పటి నుండి ఎవరి పనిలో ఉండగా.. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదలకి సిద్ధంగా ఉండగా.. ఆ తర్వాత మహేష్ తో క్రేజీ ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. ఇక బన్నీ పుష్ప సినిమా రెండో పార్టుకి సిద్దమవుతున్నాడు.

Unstoppable with NBK: అన్ స్టాపబుల్ బాలయ్య.. తెర వెనుక చిన్న కూతురు!

అయితే.. బన్నీతో రాజమౌళి సినిమా కన్ఫర్మ్ అయిందని ఇప్పుడు లేటెస్ట్ టాక్. అప్పుడు తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇప్పుడు తొలగిపోయి అదే గీత ఆర్ట్స్ ఇప్పుడు రాజమౌళితో సినిమా చర్చలు జరపడగా జక్కన్న కూడా ఒకే చెప్పాడని టాక్. అయితే.. ఇది మహేష్ తర్వాత ఉండనుంది. అంటే మరో రెండేళ్ల తర్వాతే ఈ సినిమా ఉండే అవకాశం ఉండగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పటికే రాజమౌళితో కమిట్ మెంట్ తీసుకున్నారని గట్టిగానే వినిపిస్తుంది.