Beast: కేజీఎఫ్-2తో యుద్ధానికి సిద్ధమైన బీస్ట్!

అందరూ అనుకుంటున్నదే జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ బాక్సాఫీస్ వద్ద మెగా క్లాష్‌కు తెరలేపాడు. విజయ్ నటిస్తున్న....

Beast: కేజీఎఫ్-2తో యుద్ధానికి సిద్ధమైన బీస్ట్!

Vijay Beast Locks Release Date

Beast: అందరూ అనుకుంటున్నదే జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ బాక్సాఫీస్ వద్ద మెగా క్లాష్‌కు తెరలేపాడు. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకోగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Mahesh-Vijay: బీస్ట్ పంచాయతీ.. మహేష్-యష్‌లతో విజయ్ పోటీ!

అయితే ఇప్పటికే ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ ‘కేజీఎప్ ఛాప్టర్ 2’ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. గతంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై కేవలం కన్నడ ఆడియెన్స్ మాత్రమే కాకుండా తెలుగు, హిందీ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాను ఏప్రిల్ 14న భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు.

Vijay: మెగా క్లాష్.. కేజీఎఫ్2తో బీస్ట్ వార్..?

కానీ ఇప్పుడు ఏప్రిల్ 13న బీస్ట్ చిత్రం తన రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకోవడంతో, బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ వర్సెస్ బీస్ట్ వార్ కన్ఫం అయింది. మరి ఈ వార్‌లో ఎవరు గెలుస్తారా అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక కేజీఎఫ్ 2 చిత్రాన్ని కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపిస్తారు.