Mahesh-Vijay: బీస్ట్ పంచాయతీ.. మహేష్-యష్‌లతో విజయ్ పోటీ!

టాలీవుడ్ సూపర్ స్టార్ తో ఢీ అంటే ఢీ అంటున్నాడు కోలీవుడ్ దళపతి. అనఫీషియల్ గా సర్కారు వారి పాటపై యుద్ధం ప్రకటించింది బీస్ట్. ఫిబ్రవరిలో ఫస్ట్ సింగిల్స్ తలపడ్డ మహేశ్, విజయ్..

Mahesh-Vijay: బీస్ట్ పంచాయతీ.. మహేష్-యష్‌లతో విజయ్ పోటీ!

Mahesh Vijay

Mahesh-Vijay: టాలీవుడ్ సూపర్ స్టార్ తో ఢీ అంటే ఢీ అంటున్నాడు కోలీవుడ్ దళపతి. అనఫీషియల్ గా సర్కారు వారి పాటపై యుద్ధం ప్రకటించింది బీస్ట్. ఫిబ్రవరిలో ఫస్ట్ సింగిల్స్ తలపడ్డ మహేశ్, విజయ్.. ఇప్పుడు సెకండ్ సింగిల్స్ లో బరిలోకి దిగబోతున్నారు. అటు చూస్తే కేజీఎఫ్ తో బీస్ట్ కి ఫ్యూచర్ లో పెద్ద పోరే ఉండేలా ఉంది. అసలీ బీస్ట్ పంచాయితీ ఏంటో చూసేద్దాం.

Mahesh-Vijay: ఫ్యాన్స్ మధ్య సిల్లీ వార్.. దెబ్బకి నెవెర్ బిఫోర్ రికార్డ్స్!

జాలీ జింఖానా అంటూ రెచ్చిపోతామంటున్నారు బీస్ట్ టీమ్. ఫస్ట్ సింగిల్ అరబిక్ కుతూతో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన దళపతి.. మార్చ్ 19న సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాడు. అయితే మార్చ్ 20న సర్కారు వారి పాట సెకండ్ సింగిల్ కూడా లైన్ లోకి రాబోతుంది. గత నెల వాలెంటైన్స్ డే వీక్ లో రోజు తేడాతో ఫస్ట్ సింగిల్ తో తలపడ్డారు మహేశ్ బాబు, విజయ్. ఇప్పుడు సేమ్.. ఒక రోజు తేడాతోనే వీళ్ల సినిమాల నుంచి సెకండ్ సింగిల్స్ రిలీజ్ కాబోతున్నాయి.

Mahesh-Vijay Devarakonda: మహేశ్ వర్సెస్ విజయ్.. పోటాపోటీ యాడ్స్!

బీస్ట్ పంచాయితీ.. సర్కారు వారి పాట మూవీకి తలనొప్పిగా మారింది. వ్యూస్, లైక్స్ పరంగా కళావతి సాంగ్, అరబిక్ కుతూకు మధ్య గట్టి పోటీ నడిచింది. సోషల్ మీడియాలో మా హీరో తోపంటే.. మా హీరో తోపనే ట్రోలింగ్ ఫ్యాన్స్ మధ్య ఫుల్ గా కనిపించింది. అయితే వరల్డ్ వైడ్ బీస్ట్ సాంగ్ సృష్టించిన హంగామా ముందు కళావతి కాస్త తక్కువ సందడి చేసినా.. ఏ లాంగ్వేజ్ లో అది సూపర్ హిట్ ట్రాక్ అనిపించుకుంది. రెండు పాటలకు సెలెబ్రిటీస్ దగ్గరి నుంచి కామన్ ఆడియెన్స్ వరకు రీల్స్ చుట్టేసి సోషల్ మీడియాను షేక్ చేశారు.

Arabic Kuthu: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరబిక్ కుతు సాంగ్!

మార్చ్ 19న రిలీజ్ కాబోతున్న బీస్ట్ సెకండ్ సింగిల్ ను హీరో విజయే పాడటం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ లతో పాటూ పూజా హెగ్డే కూడా ఈ పాటలో కనిపించబోతున్నారు. ప్రోమోతోనే ఫుల్ గా అట్రాక్ట్ చేస్తోంది బీస్ట్ సెకండ్ సాంగ్. అటు సర్కారు వారి పాట నుంచి మార్చ్ 20న వస్తోన్న పెన్నీ సాంగ్.. మహేశ్ ఇంట్రో సాంగ్. ఇందులో మాస్ మసాలా ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయి. అంటే తమన్ సర్కారు వారి పాట బీట్ కి, అనిరుథ్ బీస్ట్ ట్యూన్ కి మధ్య మళ్లీ గట్టి పోటీ ఉండబోతుంది.

KGF 2: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!

కేవలం సర్కారు వారి పాటతో పాటల పోటీనే కాదు.. కేజీఎఫ్2 తో రిలీజ్ క్లాష్ చూపించబోతుంది బీస్ట్. ముందే ఏప్రిల్ 14న కేజీఎఫ్2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే అదే డేట్ కు వస్తామని ట్విస్ట్ ఇచ్చారు బీస్ట్ మేకర్స్. లాల్ సింగ్ చద్దా లాంటి అన్ని సినిమాలు తప్పుకోగా ఏప్రిల్ 14న మిగిలింది బీస్ట్, కేజీఎఫ్2 మాత్రమే. చూస్తుంటే ఈసారి దళపతి విజయ్ అన్నిరకాలుగా సూపర్ కంటెంట్ ను రెడీ చేసుకొని తగ్గేదేలే అంటూ దూసుకొస్తున్నాడు. మరి రాఖీభాయ్ యశ్ తగ్గుతాడో.. తానూ తగ్గేదేలే అంటాడో చూడాలి.