Mahesh-Vijay: ఫ్యాన్స్ మధ్య సిల్లీ వార్.. దెబ్బకి నెవెర్ బిఫోర్ రికార్డ్స్!

ఆ ఇద్దరు మాస్ ఫాన్ బేసున్న హీరోలు. ఇద్దరి మధ్యా ఫ్రెండిషిప్పే ఉంది. ఆ ఇద్దరూ సౌత్ ఇండియన్ స్టార్ లయినప్పటికీ ఒకరేమో కోలీవుడ్, మరొకరేమో టాలీవుడ్. ఆ ఇద్దరు హీరోలూ సక్సెస్ రేస్ లో..

Mahesh-Vijay: ఫ్యాన్స్ మధ్య సిల్లీ వార్.. దెబ్బకి నెవెర్ బిఫోర్ రికార్డ్స్!

Vijay Mahesh

Mahesh-Vijay: ఆ ఇద్దరు మాస్ ఫాన్ బేసున్న హీరోలు. ఇద్దరి మధ్యా ఫ్రెండిషిప్పే ఉంది. ఆ ఇద్దరూ సౌత్ ఇండియన్ స్టార్ లయినప్పటికీ ఒకరేమో కోలీవుడ్, మరొకరేమో టాలీవుడ్. ఆ ఇద్దరు హీరోలూ సక్సెస్ రేస్ లో దూసుకుపోతున్నవారే.. అయినా ఫాన్స్ మధ్య రీసెంట్ గా సోషల్ మీడియాలో వార్ నడిచింది. ఆ యుద్ధమే ఇద్దరు హీరోల సినిమా పాటలు ట్రెండింగ్ లో కి తెచ్చి, రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రీజన్ అయ్యిందా అనిపిస్తుంది.

Aishwarya Dharnush: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వెనక్కు తగ్గారా?

మహేశ్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్, విజయ్ కోలీవుడ్ థళపతి. ఈ ఇద్దరికీ ఎవరి ఇండస్ట్రీలో వారికి మాసివ్ ఫాన్ ఫాలోయింగ్ ఉంది. మహేశ్ సినిమాలను విజయ్ తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టారు కూడా. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండిషిప్పే ఉంది. అయితే ఈ ఇద్దరిని ఆరాధించే ఫాన్స్ మధ్య మాత్రం సఖ్యత లేదు. సోషల్ మీడియాలో ఫాన్స్ వార్ నడిచింది. ఈ ఫాన్స్ వార్ కి మాత్రం సిల్లీ రీజన్ ఉంది. ఫిబ్రవరి 14న మహేశ్ సర్కార్ వారి పాట నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్, అదే రోజున విజయ్ సినిమా బీస్ట్ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందన్న అనౌన్స్ మెంటే ఈ హీరోల ఫాన్స్ మధ్య గొడవకి కారణం.

Kalavathi Lyrical Song: కళ్లా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి..! ఒరిజినల్ పాట విడుదల

మహేశ్ కళావతి సాంగ్, విజయ్ అరబిక్ కుత్తు సాంగ్స్ లో ఏ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని ముందుగానే ఫాన్స్ మధ్య కామెంట్స్ వార్ నడిచింది. చివరికి లీకేజీ ప్రాబ్లంతో ఒకరోజు ముందుగానే మహేశ్ బాబు కళావతి సాంగ్ రిలీజ్ అయ్యింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో సౌత్ ఇండియాలోనే నెవర్ బిఫోర్ వ్యూయర్షిప్ రికార్డ్ క్రియేట్ చేసి, మహేశ్ బాబు ఫాన్స్ ను సాటిస్ ఫై చేసింది.

Acharya: హిందీలో ఆచార్య మెగాస్టార్.. బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు?

విజయ్ విషయంలోనూ ఫిబ్రవరి 14న బీస్ట్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి 24 గంటల్లోనే ఇప్పటి వరకూ ఉన్న సౌత్ ఇండియా రికార్డ్స్ అన్నీ బద్ధలు కొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దాంతో విజయ్ ఫాన్స్ కూడా సో హాపీ. ఇద్దరు హీరోల సాంగ్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో దూసుకపోతుండటంతో ఇద్దరి ఫాన్స్ మధ్య వార్ సద్ధుమణిగింది. సో ఫాన్స్ మధ్య నడిసిన వారే వీళ్ల రికార్డ్ స్థాయి వ్యూయర్ షిప్ కి కారణమయ్యిందా లేక సాంగ్స్ లో అంత దమ్ముందా అని అదర్ స్టార్ హీరోల ఫాన్స్ కూడా ఈ సాంగ్స్ చూస్తున్నారిప్పుడు.