Aishwarya Dharnush: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వెనక్కు తగ్గారా?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. తాము విడిపోతున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా స్వయంగా ధనుష్..

Aishwarya Dharnush: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వెనక్కు తగ్గారా?

Dhanush

Aishwarya Dharnush: సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. తాము విడిపోతున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా స్వయంగా ధనుష్ వెల్ల‌డించగా.. దాదాపు 18ఏళ్లు కలిసున్న ఐశ్వర్య-ధనుష్ జంట విడిపోవ‌డం అంద‌రినీ షాక్ కి గురిచేసింది. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన ధనుష్-ఐశ్వర్య స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించిన మేము ఈరోజు విడిపోవాలని నిర్ణయించుకున్నామని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

Acharya: హిందీలో ఆచార్య మెగాస్టార్.. బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు?

దీంతో రజనీ, ధనుష్ ల అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. అయితే.. ధనుష్ తండ్రి మీడియా ముందుకొచ్చి ధనుష్-ఐశ్వర్య మళ్ళీ కలుస్తారని.. రజనీకాంత్, తాను మాట్లాడి వాళ్ళు కలిసి ఉండేలా చూస్తామని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులకు ఇంకా వాళ్ళు కలిసి ఉంటారనే ఆశకలిగింది. ఇదంతా జరిగి నెలలు గడిచినా.. వీళ్ళ వివాహబంధం గురించి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు. ఈ దంపతులు వారి వివాహ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని తమిళ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Aishwarya Dhanush: ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణమిదేనా? మళ్ళీ కలుస్తారా?

అయితే.. ఇది పూర్తిగా విడాకుల నిర్ణయంలో వెనక్కు తగ్గలేదని.. ధనుష్-ఐశ్వర్య తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు మరికొన్నాళ్లు కలిసి ఉండి మరో అవకాశంగా ఆలోచించుకోవాలని కోరారని.. ఈలోగా పిల్లలు పెద్దవాళ్ళైతే విదేశీ విద్యకు వెళ్లే వరకు పిల్లల కోసం అలోచించి వెనక్కు తగ్గినట్లుగా చెప్పుకుంటున్నారు. డైవర్స్ విషయంలో వెనక్కి తగ్గినా.. వాయిదా వేసుకున్నా ఇది అభిమానులకు మంచి వార్తే. అయితే.. ఈసారైనా ఈ జంట మనసు మారుతుందా.. లేక అసలు వెనక్కు తగ్గిన మాట వాస్తవమేనా అన్నది ఎక్కడ అధికారిక సమాచారం లేదు.