Chennakesava Reddy : ‘శరభ శరభ శరభ’.. బాలయ్య ఫ్యాన్స్ స్పెషల్ షో..

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ హిట్ ‘చెన్నకేశవ రెడ్డి’ 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్ స్పెషల్ షో..

Chennakesava Reddy : ‘శరభ శరభ శరభ’.. బాలయ్య ఫ్యాన్స్ స్పెషల్ షో..

Balayya Fans

Chennakesava Reddy: నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషల్‌గానే చేస్తారు. రీల్ లైఫ్‌లో బాలయ్యను గాడ్ ఆఫ్ మాసెస్‌గా కొలిచే ఫ్యాన్స్.. రియల్ లైఫ్ కొచ్చేసరికి ‘ఆదేశం మీది.. ఆచరణ మాది’ అంటూ బాలయ్య అడుగుజాడల్లో నడుస్తూ.. ఆయన దారిలోనే పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.

ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా బాలయ్య మీద తమ అభిమానాన్ని చాటుకున్న అభిమానులు ఈసారి మరో బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టారు. 2002 సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన బాలయ్య మాస్ హిట్ సినిమా ‘చెన్నకేశవ రెడ్డి’ 2021 సెప్టెంబర్ 25 నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా శనివారం (సెప్టెంబర్ 25) రాత్రి 9:15 గంటలకు హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని దేవి 70 MM థియేటర్లో స్పెషల్ షో ప్లాన్ చేశారు.

Nbk Fans

 

సాధారణంగా హీరో పుట్టినరోజు అప్పుడో.. లేదా ఓ సినిమా 5, 10 ఇలా ల్యాండ్ మార్క్ ఇయర్స్ అయినప్పుడో షో వేస్తుంటారు. కానీ 19 సంవత్సరాలకు షో వెయ్యడం విశేషం. అదే మరి బాలయ్య ఫ్యాన్స్ అంటే.. అప్పట్లో ఫిల్మ్స్ ఉండేవి. ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయింది. దీంతో తమకు పరిచయమున్న సినీ పరిశ్రమ వారి సాయంతో ‘చెన్నకేశవ రెడ్డి’ ప్రింట్ తెప్పించి డిజిటల్‌లోకి ఆ తర్వాత క్యూబ్‌లోకి కన్వెర్షన్ చేయించి, స్పెషల్ షో ఏర్పాటు చేసి మరీ బాలయ్యపై అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్.

Nandamuri Mokshagna : ఇలాంటి అభిమానం.. నందమూరి సొంతం.. వైరల్ అవుతున్న ఫ్యాన్ టాటూ..

ఇక హంగామా మాత్రం ఎక్కడా తగ్గకూడదని ఫిక్స్ అయిపోయారు. రిలీజ్ రోజు ఎంత హడావిడి చేస్తారో.. శనివారం కూడా అంతకుమించి అనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పూలు, పేపర్లు, క్రాకర్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ఫ్లెక్సీలు పోటీ పడి మరీ కడుతున్నారు. ఇక నందమూరి అభిమనా సోదరుడు, దర్శకుడు బోయపాటి శ్రీను, ‘అఖండ’ తర్వాత బాలయ్యతో సినిమా చెయ్యబోతున్న గోపిచంద్ మలినేని వంటి పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించారు. ఈ స్పెషల్ షో తో హిస్టరీ క్రియేట్ చేస్తామంటున్నారు బాలయ్య అభిమానులు..

Chennakesava Reddy