Child Pornography: చైల్డ్‌ పోర్నోగ్రఫీపై సీబీఐ ఫోకస్‌.. దేశవ్యాప్తంగా అరెస్ట్‌లు.. చూసినా నేరమే!

చిన్నారుల అశ్లీల వీడియోల వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి.

Child Pornography: చైల్డ్‌ పోర్నోగ్రఫీపై సీబీఐ ఫోకస్‌.. దేశవ్యాప్తంగా అరెస్ట్‌లు.. చూసినా నేరమే!

Cbi

Child Pornography: చిన్నారుల అశ్లీల వీడియోల వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే ముఠాలే లక్ష్యంగా దాడులు నిర్వహించిన సీబీఐ.. నిన్న మరో ఏడుగురిని అరెస్ట్‌ చేసింది. ఢిల్లీ, నోయిడా, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, ఏపీకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది.

మంగళవారం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 77 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు. చిన్నారుల్ని లైంగికంగా వేధించిన ఆరోపణలపై సీబీఐ ఈ నెల 14న 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఏపీ సహా.. ఢిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్‌, బిహార్‌, ఒడిశా, తమిళనాడు, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. సుమారు 80 బృందాలు అనుమానిత ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు వెల్లడించింది. సీబీఐలోని O.C.S.A.E విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఈ దాడులు చేపట్టింది.

Maha Dharna: కేంద్రంపై యుద్ధం.. ఇందిరాపార్క్‌లో టీఆర్‌ఎస్‌ మహా ధర్నా నేడే!

ఈ దందాలో దేశ, విదేశాల్లోని పలు ముఠాలు, సంస్థల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. సుమారు 5 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్‌ మీడియాలో చైల్డ్‌ పోగ్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌(ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది.

చైల్డ్‌ సెక్స్‌వల్‌ అబ్యూజ్డ్‌ మెటీరియల్‌ను (సీఎస్‌ఏఎం) కనిపెట్టడానికి ఈ సంస్థ అత్యాధునిక సాఫ్ట్‌వేర్స్‌ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగా చూసేవారిని కూడా అరెస్ట్ చెయ్యవచ్చు. సోషల్‌ మీడియాలో చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసినా, చూసినా, డౌన్‌లోడ్, అప్‌లోడ్‌ చేసినా నేరమేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Ameerpet: అమీర్‌పేటలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. నమ్మన స్నేహితుడినే లక్షల్లో మోసం చేశాడు