RRR: బ్లాస్టింగ్ ఈవెంట్‌కు గెస్టులుగా చిరు-బాలయ్య.. బొమ్మ దద్దరిల్లాల్సిందే!

ఇంకో రెండు వారాలు సమయం ఉంది. జనవరి 7న మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వెండితెర మీద ప్రదర్శితం కానుంది. ఎన్ని థియేటర్లలో విడుదల చేసినా తొలి వారం టికెట్లు దొరుకుతాయా..

RRR: బ్లాస్టింగ్ ఈవెంట్‌కు గెస్టులుగా చిరు-బాలయ్య.. బొమ్మ దద్దరిల్లాల్సిందే!

Rrr

RRR: ఇంకో రెండు వారాలు సమయం ఉంది. జనవరి 7న మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వెండితెర మీద ప్రదర్శితం కానుంది. ఎన్ని థియేటర్లలో విడుదల చేసినా తొలి వారం టికెట్లు దొరుకుతాయా అసలు అన్నట్లుగా ఉంది ఈ సినిమా క్రేజ్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాకి ఈ స్థాయి అంచనాలు లేకపోగా.. మీరు ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి అంతకు మించే ఈ సినిమా ఉంటుందని.. సినిమా యూనిట్ మాత్రం ఈ అంచనాలను ఇంకా ఇంకా పెంచేస్తూనే ఉంది.

RRR: ప్రమోషన్స్.. భీమ్-రామ్ మేకింగ్ వీడియోలు వైరల్!

ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుకలతో ప్రమోషన్ మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ టీమ్ ముంబైలో కనీవినీ ఎరుగని రీతిలో మరే తెలుగు సినిమాకు జరగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. త్వరలోనే హైదరాబాద్ లో మరో ఈవెంట్ ప్లాన్ చేసిన నిర్వాహకులు ఇప్పటికే దీనికోసం ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. ముంబై ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హాజరుకాగా హైదరాబాద్ ఈవెంట్ కు ఎవరు హాజరవుతారన్నది ఆసక్తిగా మారింది. అయితే, తాజాగా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కు ఇద్దరు టాప్ స్టార్స్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నాలుగు నెలల వరకు ఏ సినిమా రిలీజ్ చేయకండి

టాలీవుడ్ సీనియర్ హీరోలలో టాప్ స్టార్స్ ఎవరంటే నో డౌట్ చిరంజీవి, బాలకృష్ణల పేర్లే వినిపిస్తాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఈ ఈవెంట్ కు హాజరుకానున్నట్లు టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉండగా ఈరోజు, రేపు అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు చెప్తున్నారు. ఇదే నిజమైతే ఇది అభిమానులకు కన్నుల పండగగా మారనుంది. రెండు తరాల నుండి రెండు కుటుంబాల హీరోలు ఒక వేదికపై కనువిందుగా కనిపిస్తే అది అభిమానులకు వెలకట్టలేని ఆనందం. మరి ఇది ఎంతవరకు నిజమన్నదే చూడాల్సి ఉంది.