RRR : ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నాలుగు నెలల వరకు ఏ సినిమా రిలీజ్ చేయకండి

తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ బాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు. సల్మాన్ ఖాన్ ముఖ్య అతిధిగా వచ్చారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నాలుగు నెలల వరకు ఏ సినిమా రిలీజ్ చేయకండి

Rrr Salman

RRR:   స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా, ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ట్రైలర్ చూసిన తర్వాత దేశ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా టీమ్ అన్ని భాషల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాలని మొదలు పెట్టింది. జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ బాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు. సల్మాన్ ఖాన్ ముఖ్య అతిధిగా వచ్చారు ఈ ఈవెంట్ కి. అయితే ఈ ఈవెంట్ ను లైవ్ టెలికాస్ట్ చేయలేదు. డిసెంబర్ 31వ తేదీన స్టార్ ప్లస్ లో ప్రసారం చేయనున్నారు.

RRR “అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్

సల్మాన్ ఖాన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. “రాజమౌళి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏమిటో ఆయన సినిమాలే చెప్పేశాయి. ఇండియన్ సినిమాను ఆయన ప్రపంచస్థాయికి తీసుకుని వెళ్లారు. అన్ని భాషలకి చెందిన హీరోలంతా రాజమౌళితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి రాజమౌళి నుంచి వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్ నేను చూశాను. ఈ సినిమా ఎలా ఉండబోతుందో నాకు ఒక అవగాహన వచ్చింది. అందుకే చెబుతున్నాను.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత ఒక 4 నెలల వరకూ ఎవరూ తమ సినిమాల రిలీజ్ లు పెట్టుకోవద్దు. ఒకవేళ రిలీజ్ పెట్టుకుంటే అది పెద్ద సాహసమే అవుతుంది” అని అన్నారు.

Rakul Preet Singh : రకుల్ ఎనర్జీకి అవే కారణం అంట..

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓ రేంజ్ లో ప్రభావం చూపిస్తుంది. ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. ఇది ఒక తుఫాన్ లాంటిది. నేను ఒక తుఫాన్ కోసం ఎదురుచూడటం ఇదే ఫస్టు టైమ్ అనుకుంటాను అని అన్నారు. ఇక చరణ్ గురించి మాట్లాడుతూ.. ”చరణ్ నాకు చాలా కాలంగా తెలుసు. ఎప్పుడు చూసినా ఏదో ఒక షూటింగులో అయిన గాయంతోనే కనిపిస్తూ ఉంటాడు. ఆయనలాంటి హార్డ్ వర్కర్ ను నేను చూడలేదు” అని అన్నారు. ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ”ఎన్టీఆర్ మంచి యాక్టర్, అంతకు మించి మంచి డాన్సర్. ఆయన డాన్స్ కి నేను కూడా అభిమానినే. ఆయన ఎంతలా కష్టపడతాడనే విషయాలను నేను విన్నాను” అంటూ ఎన్టీఆర్ ని అభినందించారు.