Rakul Preet Singh : రకుల్ ఎనర్జీకి అవే కారణం అంట..

సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది రకుల్. తాజాగా తన ఎనర్జీకి సీక్రెట్ ఏంటో సోషల్ మీడియాలో తెలిపింది రకుల్.

Rakul Preet Singh : రకుల్ ఎనర్జీకి అవే కారణం అంట..

Rakul

Updated On : December 20, 2021 / 9:33 AM IST

Rakul Preet Singh :  తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల వైష్ణవ తేజ్ సరసన ‘కొండపొలం’ సినిమాలో కనిపించింది. ఇప్పుడు వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో దాదాపు 7 బాలీవుడ్ సినిమాలు ఉండటం విశేషం. అదే టైంలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఇక సినిమాల్లోనే కాక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది రకుల్.

Rashmika Mandanna : లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పిన రష్మిక

తాజాగా తన ఎనర్జీకి సీక్రెట్ ఏంటో సోషల్ మీడియాలో తెలిపింది రకుల్. తన ఎనర్జీకి పసుపు కలిపిన పాలే కారణం అంట. పసుపు కలిపిన పాలు తరుచు తాగుతుంది అంట రకుల్. అలాగే కోల్డ్ తగ్గడానికి కూడా తాను పసుపు కలిపి పాలే తాగుతాను అని తెలిపింది. తాజాగా బయట మాల్ లో పసుపు కలిపిన పాలని కొనుక్కొని తాగుతూ వాటిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయం చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ విషయం మన పూర్వీకుల నుంచే మనకు తెలుసు. ఇపుడు స్టార్ హీరోయిన్ రకుల్ కూడా ఇదే ఫాలో అవ్వడం విశేషం.

Bangarraju : నువ్వు పెళ్లిచేసుకెళ్లిపోతే ‘బంగార్రాజు’.. మాకింకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)