Bangarraju : నువ్వు పెళ్లిచేసుకెళ్లిపోతే ‘బంగార్రాజు’.. మాకింకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు

తాజాగా ‘పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పేరుతో ఈ ఐటెం సాంగ్ లిరికల్ ని విడుదల చేశారు. ‘నువ్వు పెళ్లిచేసుకెళ్లిపోతే బంగార్రాజు.. మాకింకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు, నువ్వు.........

Bangarraju :  నువ్వు పెళ్లిచేసుకెళ్లిపోతే ‘బంగార్రాజు’.. మాకింకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు

Bangarraju item song

Bangarraju :   అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా రాబోతున్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఉండబోతుంది. ఈ ఐటెం సాంగ్ లో ‘జాతి రత్నాలు’తో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నాగార్జున, నాగ చైతన్యలతో ఆడిపాడనుంది.

తాజాగా ‘పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పేరుతో ఈ ఐటెం సాంగ్ లిరికల్ ని విడుదల చేశారు. ‘నువ్వు పెళ్లిచేసుకెళ్లిపోతే బంగార్రాజు.. మాకింకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు, నువ్వు శ్రీరాముడైపోతే బంగార్రాజు.. మాకింకెవ్వడు తీరుస్తాడు ముద్దుమోజు..వాసివాడి తస్సాదియ్యా’ అంటూ మంచి ఫాస్ట్ బీట్ లో సాగింది ఈ పాట. ఇప్పుడు ఈ ‘వాసివాడి తస్సాదియ్యా’ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

Bigg Boss : లేడీ కంటెస్టెంట్స్ అందాల ఆరబోతకే పరిమితమా? టైటిల్ ఇవ్వరా??

ఈ పాటను సినిమా డైరెక్టర్ కల్యాణ్‌కృష్ణనే రచించారు. మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్దన్‌ చావలి సాంగ్ ని పాడగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇందులో చిట్టితో కలిసి నాగార్జున, నాగచైతన్య స్టెప్పులేశారు. మాస్‌ సాంగ్ గా ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఫరియా మంచి డ్యాన్సర్ కావడంతో సినిమాలో ఈ పాటకి ఏ రేంజ్ లో స్టెప్పులేస్తోందో అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.