Bigg Boss : లేడీ కంటెస్టెంట్స్ అందాల ఆరబోతకే పరిమితమా? టైటిల్ ఇవ్వరా??

ఈ సీజన్ కూడా అబ్బాయే బిగ్ బాస్ విన్నర్ గా నిలవడంతో పాటు ఈ సీజన్లో అమ్మాయిలందర్నీ ముందే ఎలిమినేట్ చేయడంతో సోషల్ మీడియాలో కొంతమంది దీనిపై వ్యతిరేకతని చూపిస్తున్నారు.

Bigg Boss : లేడీ కంటెస్టెంట్స్ అందాల ఆరబోతకే పరిమితమా? టైటిల్ ఇవ్వరా??

Biggboss

Bigg Boss :   తాజాగా బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో సన్నీ విన్నర్ గా నిలిచాడు. అయితే ఈ సీజన్ కూడా అబ్బాయే బిగ్ బాస్ విన్నర్ గా నిలవడంతో పాటు ఈ సీజన్లో అమ్మాయిలందర్నీ ముందే ఎలిమినేట్ చేయడంతో సోషల్ మీడియాలో కొంతమంది దీనిపై వ్యతిరేకతని చూపిస్తున్నారు. టాప్ 5లో ఉన్న ఒకే ఒక అమ్మాయి సిరిని కూడా లాస్ట్ లో ఎలిమినేట్ చేశారు. మొదటి 4 సీజన్స్ కూడా అబ్బాయిలు టైటిల్‌ గెలిచారు. కనీసం ఐదో సీజన్ అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే ఈ సారి కూడా అబ్బాయిలకు కప్పు ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ రన్నరప్ వరకు వచ్చినా విన్నర్ గా జెంట్ కంటెస్టెంట్స్ నే ప్రకటించారు. ఇదంతా స్క్రిప్టెడ్ షో అని చాలా మందికి తెలుసు. టిఆర్పీ కోసం, ప్రోగ్రాం హైప్ కోసం ఒక్కోసారి వాళ్ళకి వచ్చిన ఓటింగ్స్ కూడా పట్టించుకోకుండా ప్రోగ్రాంలో చేంజెస్ చేస్తారు. ఈ సారి కూడా ఓటింగ్స్ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేయడాలు, హౌస్ లో చివరివరకు అమ్మాయిలని గ్లామర్ కోసం ఉంచడాలు చేశారు. గతంలో కూడా ఇది జరిగింది. అమ్మాయిలకి ఓటింగ్స్ బాగానే వస్తున్నా వాళ్ళని కేవలం గ్లామర్ షోకి మాత్రమే బిగ్ బాస్ వాడుతుంది అని కొంతమంది సీరియస్ అవుతున్నారు.

Nani : బిగ్‌బాస్ హోస్ట్‌గా నాని.. ఇది నా రీయూనియన్

తొలి సీజన్ శివబాలాజీ, రెండో సీజన్ కౌశల్, మూడో సీజన్ రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ అభిజిత్ టైటిల్ తీసుకున్నారు. ఐదోసారి సన్నీ టైటిల్ గెలిచాడు. బిగ్ బాస్ షోలో అమ్మాయిలు ఉన్నా కూడా కేవలం గ్లామర్ కోసమే కొన్ని చోట్ల వాడారు. ఇంట్లో వాళ్లంతా అందాలను ఆరబోస్తూ కెమెరాలకు ఫోజులివ్వడమే సరిపోయింది. అంతేకాక జెంట్ కంటెస్టెంట్స్ తో హగ్గులు, ముద్దులు, రొమాన్స్ కోసం వాడుతున్నారు లేడీ కంటెస్టెంస్ట్ ని. ఇప్పటికే అయిదు సీజన్లుగా ఇదే జరుగుతుంది. దీంతో కొన్ని మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి ఆరో సీజన్ అయినా దీనికి ఫుల్ స్టాప్ పెట్టి లేడీ కంటెస్టెంట్ ని గెలిపిస్తుందా లేక ఎప్పటిలాగే చేస్తుందా చూడాలి.