Nani : బిగ్‌బాస్ హోస్ట్‌గా నాని.. ఇది నా రీయూనియన్

గతంలో బిగ్ బాస్ 2 సీజ‌న్‌కు నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత బిగ్ బాస్ 3 సీజ‌న్ నుంచి నాగార్జునే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే నిన్న నాని..........

Nani : బిగ్‌బాస్ హోస్ట్‌గా నాని.. ఇది నా రీయూనియన్

Nani :   నిన్న బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలంతా బిగ్ బాస్ కి తరలి వచ్చారు. ఇందులో భాగంగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగ‌రాయ్’ మూవీ టీమ్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదికి తమ ప్రమోషన్స్ కోసం వచ్చారు. నాచుర‌ల్ స్టార్ నాని, హీరోయిన్లు సాయిపల్ల‌వి, కృతి శెట్టిలు బిగ్ బాస్ కి వచ్చారు.

గతంలో బిగ్ బాస్ 2 సీజ‌న్‌కు నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత బిగ్ బాస్ 3 సీజ‌న్ నుంచి నాగార్జునే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే నిన్న నాని రావడంతో కాసేపు బిగ్ బాస్ లో హోస్ట్ గా వ్యవహరించాడు. కంటెస్టెంట్స్ తో హోస్ట్ గా మాట్లాడాడు. వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చి ఎవరూ తీసుకోకపోవడంతో మానస్ ని ఎలిమినేట్ చేసే పార్ట్ ని నాని హోస్ట్ చేశాడు.

Bigg Boss 5 : సన్నీతో పాటు షణ్ముఖ్‌కి కూడా ఫ్లాట్

ఆ తర్వాత నాని మాట్లాడుతూ.. ”ఇది నా రీయూనియన్ లా ఉంది. నేను బిగ్ బాస్ 2 చేసిన తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ ఈ స్టేజి మీదకి రాలేదు. ఇవాళా బిగ్ బాస్ తో నా రీయూనియన్. అలాగే నాగార్జునతో ‘దేవదాసు’ సినిమా చేసాను. నా దేవాతో కూడా ఇది నాకు రీయూనియన్ అని అన్నాడు. ఆ తర్వాత హీరోయిన్లు కృతి, సాయి పల్ల‌వి ఇద్ద‌రూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి ఎంటర్టైన్ చేశారు. నాని కూడా కాసేపు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఎంటర్టైన్ చేశాడు.