Rashmika Mandanna : లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పిన రష్మిక

ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పిందని సమాచారం. అయితే అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం.

Rashmika Mandanna :  లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పిన రష్మిక

Rashmika

Rashmika Mandanna :   ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక. ఇప్పటికే వరుసగా హిట్స్ కొడుతూ స్టార్ హీరోల సరసన చేస్తుంది. ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో శ్రీవల్లిగా ప్రేక్షకులని అలరించింది. ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పిందని సమాచారం. అయితే అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం.

లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఆలోచిస్తారు. ఈ సినిమాలు అందరి హీరోయిన్స్ కి సెట్ అవ్వవు కూడా. ఇప్పుడే స్టార్ హీరోయిన్ అయిన రష్మిక ఇంత తొందరగా లేడీ ఓరియెంటెడ్ సినిమా ఒప్పుకుంది అంటే సాహసమే అని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ మహిళా ప్రధాన చిత్రాలతో సత్తా చాటారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఈ నేషనల్ క్రష్ కూడా చేరనుంది.

Bangarraju : నువ్వు పెళ్లిచేసుకెళ్లిపోతే ‘బంగార్రాజు’.. మాకింకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు

ఇటీవల యాక్టర్, డైరెక్టర్ రాహుల్‌ రవీంద్రన్‌ రష్మికకి ఓ లేడీ ఓరియెంటెడ్ కథ వినిపించారట. ఆ కథ నచ్చి రష్మిక ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఫిబ్రవరిలో లేదా సమ్మర్ లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తే రష్మిక హీరోయిన్ గా ఇంకో మెట్టు ఎక్కేసినట్టే. త్వరలో శర్వానంద్ తో కలిసి ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ సినిమాతో రాబోతుంది. బాలీవుడ్ లో కూడా ఈ సమ్మర్ లో ‘మిషన్ మజ్ను’ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.

Bigg Boss 5 : సన్నీతో పాటు షణ్ముఖ్‌కి కూడా ఫ్లాట్