Chiru 154: బాబీ సినిమాకీ లీకుల బెడద.. వాల్తేరు శీనయ్య కథ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగానే..

Chiru 154: బాబీ సినిమాకీ లీకుల బెడద.. వాల్తేరు శీనయ్య కథ ఇదేనా?

Chiru 154

Chiru 154: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్లో పెట్టేస్తున్నాడు. ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగానే గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాను మొదలు పెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ లో ఉన్న బాబీ అండ్ టీం అందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Nandamoori వారి పెళ్ళిసందడి.. నారా, దగ్గుబాటి కుటుంబాల కలయిక!

కాగా.. ప్రస్తుతం సినిమాకి లీకుల బెడద తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ స్పాట్ నుండి ఎడిటింగ్ రూమ్ వరకు ఏ సీన్ ఎక్కడ బయటకి వస్తుందో కూడా తెలియక మేకర్స్ చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. అయినా లీకుల వీరు ఆత్రం ఆపుకోలేక కక్కేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలకు లుక్స్ నుండి ఏకంగా సినిమాలే లీకులు కాగా.. చిరంజీవి-బాబీ సినిమాల కథ కూడా లీకైందని.. ఇదే ఆ కథ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ కథ ఇదేనని చర్చలు మొదలయ్యాయి.

Telugu Film Releases: ఈ వీకెండ్ థియేటర్‌లోకి వచ్చిన సినిమాలివే!

ఈ సోషల్ మీడియా టాక్ ను బట్టి చూస్తే.. ఇందులో చిరంజీవి పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఓపెన్ అవుతుందని.. అప్పటి వరకు ఒక పని మీద చిరు మారువేషంలో ఉంటాడట. శ్రీలంక నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుండగా.. ఎక్కువగా సముద్రతీరంలోనే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు బాబీ. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ పక్కా మాస్ లుక్ లో చిరు పాత రోజులను గుర్తు చేయగా వాల్తేరు శీనయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటించనున్నాడని చెప్పుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు.