Telugu Film Releases: ఈ వీకెండ్ థియేటర్‌లోకి వచ్చిన సినిమాలివే!

ఒకవైపు అఖండ జాతర కొనసాగుతుండగానే ఈశుక్రవారం కూడా కొత్త సినిమాలు ధియేటర్లలోకి వచ్చేశాయి. పెద్దగా కాంపిటీషన్ లేని టైమ్ చూసి నాగశౌర్య సేఫ్ గా లాండ్ అవుదామని ప్లాన్ చేసుకున్న నాగశౌర్య

Telugu Film Releases: ఈ వీకెండ్ థియేటర్‌లోకి వచ్చిన సినిమాలివే!

Telugu Film Releases

Telugu Film Releases: ఒకవైపు అఖండ జాతర కొనసాగుతుండగానే ఈశుక్రవారం కూడా కొత్త సినిమాలు ధియేటర్లలోకి వచ్చేశాయి. పెద్దగా కాంపిటీషన్ లేని టైమ్ చూసి నాగశౌర్య సేఫ్ గా లాండ్ అవుదామని ప్లాన్ చేసుకున్నాడు నాగశౌర్య. చాలా కాలం తర్వాత పర్ ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసిన శ్రియ, పాన్ ఇండియా రిలీజ్ గా మడ్డీ .. ఇలా ఈరోజు ఈ డిసెంబర్ 10న మరికొన్ని సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చేశాయి.

డిసెంబర్ 10న ధియేటర్లోకి వచ్చిన సినిమాల్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన సినిమా లక్ష్య. నాగశౌర్య, కేతిక శర్మ జంటగా సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్లో తెరకెక్కిన లక్ష్య ఈ శుక్రవారం రిలీజ్ అయ్యిది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో.. జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న లక్ష్య సినిమా కోసం నాగశౌర్య ఆర్చరీలో స్పెషల్ ట్రెయినింగ్ తీసుకుని ఫిజికల్ గా చాలా కష్టపడ్డాడు. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మంచి బజ్ తో ఈ వీకెండ్ కి వచ్చేసింది.

ఇక, శ్రియ, ప్రియాంకా జవాల్కర్, శివ కందుకూరి, సుహాస్ లీడ్ రోల్స్ లో స్టోరీ డ్రివెన్ మూవీగా తెరకెక్కిన సినిమా గమనం. సుజనారావ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కూడా డిసెంబర్ 10 శుక్రవారం ధియేటర్లోకి వచ్చేసింది. 3 డిఫరెంట్ స్టోరీస్ ని ఒకే సినిమాగా చూపించిన గమనం మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని మరిపించేలా తెరకెక్కింది. అంతేకాదు ఇప్పటి వరకూ గ్లామర్ రోల్స్ చేసిన శ్రియ.. ఫుల్ ఫ్లెడ్జ్ పర్ ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

డిసెంబర్ 10నే రిలీజ్ అయిన మరో రెండు సినిమాలు మడ్డీ, నయూం డైరీస్. ఇండియాలో ఫస్ట్ టైమ్ ఆఫ్ రోడ్ మడ్ రేస్ మూవీగా తెరకెక్కిన సినిమా మడ్డీ. డాక్టర్ ప్రగ్బాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. గ్యాంగ్ స్టర్ నయూం లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా నయూం డైరీస్ కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆలస్యమెందుకు.. ఈ సినిమాలలో మీరు ఏది చూడలేకుంటే అది ఈ వీక్ ఎండ్ ప్లాన్ చేసుకోండి.