Bholaa Shankar : భోళా శంకర్ అప్డేట్ ఇస్తూ.. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిరు..

ఆగష్టు 11న రిలీజ్ కాబోతున్న భోళా శంకర్ నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిరు..

Bholaa Shankar : భోళా శంకర్ అప్డేట్ ఇస్తూ.. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిరు..

Chiranjeevi complete his dubbing part of Bholaa Shankar

Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుంది. మరో భామ కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది. అక్కినేని హీరో సుశాంత్ కీర్తికి జోడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే చిరంజీవి తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేసినట్లు తెలియజేశాడు.

Bro : మ్యూజికల్ ప్రమోషన్ మొదలుపెట్టబోతున్న బ్రో.. మై డియర్ మార్కండేయ ఫస్ట్ సింగల్!

ఆ విషయంతో పాటు ఈ సినిమా ఎలా ఉండబోతుందో కూడా చెప్పుకొచ్చాడు. “సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్. ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది” అంటూ కాన్ఫిడెన్స్ ని తెలియజేశాడు. ఇక చిరు కాన్ఫిడెన్స్ చూసి అభిమానుల్లో సినిమా పై అంచనాలు మొదలు అవుతున్నాయి. కాగా ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తుంది. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో ఈ సినిమా సాగనుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

O Saathiya : ఫస్ట్ లవ్ మధుర జ్ఞాపకాలు మదిలో మెదిల్చే ఓ సాథియా.. రేపే గ్రాండ్‌గా విడుదల

ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత వస్తున్న మూవీ కావడంతో భోళా శంకర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ చిత్రం ఆ హైప్ ని ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఆగష్టు 11న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగినట్లు సమాచారం. ఆల్రెడీ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.