Bro : మ్యూజికల్ ప్రమోషన్ మొదలుపెట్టబోతున్న బ్రో.. మై డియర్ మార్కండేయ ఫస్ట్ సింగల్!
బ్రో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు. మై డియర్ మార్కండేయ అనే ఫస్ట్ సింగల్ ని..

Bro first single My Dear Markandeya song is ready to release
Bro : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. ‘గోపాల గోపాల’ సినిమాలో మోడరన్ శ్రీకృష్ణుడిగా కనిపించిన పవన్.. ఈ చిత్రంలో మరోసారి టైం అనే దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన వినోదయ సితం (Vinodaya Sitham) కి ఇది రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగులో కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా పై ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ మూవీ షూటింగ్ ని కూడా చిత్ర యూనిట్ బుధవారం పూర్తి చేసింది. దీంతో ఇక పూర్తిగా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ‘మై డియర్ మార్కండేయ’ త్వరలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఒక ట్వీట్ చేసింది. ఈ సినిమా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ లో మ్యూజిక్ ఆల్బమ్ పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మరి థమన్ ఏ రేంజ్ లో ఇస్తాడో చూడాలి.
Salaar : అప్పుడు సాహో.. ఇప్పుడు సలార్.. టీజర్‌లో ఎలివేషన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?
కాగా ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) సాయి ధరమ్ కి జోడిగా నటిస్తుంది. అలాగే ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. పీపుల్ మేడి ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. ఒక తెలుగులోనే 70 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ సెల్ అయ్యినట్లు సమాచారం.
#BroTheAvatar Musical Reign will begin with the First Single #MyDearMarkandeya ??
Locked & Loading on @MangoMusicLabel ?@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @neeta_lulla @zeestudiossouth #BROFromJuly28 pic.twitter.com/Lj5JiIHeAJ
— People Media Factory (@peoplemediafcy) July 6, 2023