Spider Man – Brand New Day : ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
Spider Man - Brand New Day
Spider Man - Brand New Day
Spider Man – Brand New Day : స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఇప్పుడు మరో కొత్త సినిమా రాబోతుంది. ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అవ్వనుంది. ఇండియాలో కూడా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
తాజాగా స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు. న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైన టామ్ హాలండ్ ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ చూస్తుంటే.. నో వే హోమ్ సంఘటనలు జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత పీటర్ తన వాళ్లందరికీ దూరంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. తన పేరును ఏమాత్రం గుర్తుపట్టలేని న్యూయార్క్ నగరంలో స్పైడర్ మ్యాన్ గా పోరాడుతూ, సిటీని రక్షిస్తున్నాడు. కానీ అతని శారీరక మార్పులు, న్యూయార్క్ నగరంలో జరుగుతున్న వింతైన నేరాలతో పీటర్ ఏం చేస్తాడు అనే విదేశంగా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
Also See : Rashi Singh : రాశీ సింగ్ ఉగాది స్పెషల్ ఫొటోలు.. హాఫ్ శారీలో అందంగా..
మీరు కూడా స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే తెలుగు ట్రైలర్ చూసేయండి..
డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్పైడర్-మ్యాన్‌గా టామ్ హాలండ్ మళ్ళీ నటిస్తుండగా, జెండయా, జాకబ్ బటలాన్, సాడీ సింక్, జోన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో, ట్రామెల్ టిల్మాన్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియాలో ఈ సినిమాని జూలై 31న రిలీజ్ చేస్తుంది.
Also Read : Nabha Natesh : నభా నటేష్ ఉగాది స్పెషల్ ఫొటోలు.. ట్రెడిషినల్ లుక్స్ లో..
