Chiranjeevi : సత్యదేవ్‌కి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్.. ‘గాడ్ ఫాదర్’లో రోల్ లీక్..

ఆచార్య సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆచార్యలో తాను కూడా ఉన్నాను అని సర్‌ప్రయిజ్ ఇచ్చాడు అందరికి.......

Chiranjeevi : సత్యదేవ్‌కి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్.. ‘గాడ్ ఫాదర్’లో రోల్ లీక్..

Satya Dev

Satyadev :  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి అందరూ సినిమా విడుదల సందర్భంగా విషెష్ చెప్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా అన్నయ్య అంటూ మెగాస్టార్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చిరంజీవితో కలిసి నటించాలని, పని చేయాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు వారి ఆనందం అంతా ఇంతా ఉండదు.

తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆచార్యలో తాను కూడా ఉన్నాను అని సర్‌ప్రయిజ్ ఇచ్చాడు అందరికి. ఇటీవల తన నటనతో అందర్నీ మెప్పించి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన ట్వీట్ లో.. ”అన్నయ్యా.. నటనలో, జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది.” అంటూ తెలిపాడు.

Language War : సుదీప్ చెప్పింది కరక్టే.. సీఎంతో సహా మద్దతిస్తున్న కన్నడ నేతలు..

 

అయితే సత్యదేవ్ చేసిన ఈ ట్వీట్‌కి మెగాస్టార్ రిప్లై ఇవ్వడం విశేషం. చిరంజీవి ఈ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ.. ”డియర్ సత్యదేవ్. థ్యాంక్ యు. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం. ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. కానీ గాడ్ ఫాదర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం. నిన్ను చూసి గర్విస్తున్నాను. నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి.” అని అన్నారు చిరంజీవి. దీంతో సత్యదేవ్ గాడ్ ఫాదర్ సినిమాలో విలన్‌గా నటించబోతున్నట్టు చిరంజీవి లీక్ చేశారు. ఇలా సత్యదేవ్ ట్వీట్‌కి చిరు రిప్లై ఇవ్వడంతో అటు చిరంజీవి, ఇటు సత్యదేవ్ అభిమానులు ఇద్దర్ని పొగుడుతున్నారు.