Language War : సుదీప్ చెప్పింది కరక్టే.. సీఎంతో సహా మద్దతిస్తున్న కన్నడ నేతలు..

తాజాగా ఈ భాషా వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సుదీప్ కి సపోర్ట్ గా మాట్లాడారు. కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ్‌ బొమ్మై మాట్లాడుతూ.. ''భాషా ప్రాతిపదికన............

Language War : సుదీప్ చెప్పింది కరక్టే.. సీఎంతో సహా మద్దతిస్తున్న కన్నడ నేతలు..

Sudeep

 

Language War :  గత కొద్ది రోజులుగా సౌత్ సినిమా, బాలీవుడ్ సినిమా అంటూ మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల ఓ కన్నడ స్టార్ హీరో సుదీప్‌ మాట్లాడుతూ.. సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫిస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాయని, బాలీవుడ్ సినిమాలని మించి కలెక్షన్లని వసూలు చేస్తున్నాయని, అలాగే ఇకపై హిందీ జాతీయ భాషగా ఉండదని అన్నారు. అయితే సుదీప్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.

సుదీప్ వ్యాఖ్యలకి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ స్వయంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. అంతే కాక సౌత్, హిందీ నెటిజన్ల మధ్య ఈ వ్యాఖ్యలతో లాంగ్వేజ్ వార్ మొదలైంది. సుదీప్‌కి, అజయ్ దేవగణ్‌కి సపోర్ట్ గా ఇరు పక్షాలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ లాంగ్వేజ్ వార్ పై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక సుదీప్ చేసిన వ్యాఖ్యలకి కర్ణాటక ప్రజలు, పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నేతలు మద్దతు తెలుపుతున్నారు.

 

RGV : ముదురుతున్న లాంగ్వేజ్ వార్.. బాలీవుడ్‌కి ఛాలెంజ్ చేస్తూ మధ్యలో దూరిన ఆర్జీవీ..

తాజాగా ఈ భాషా వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సుదీప్ కి సపోర్ట్ గా మాట్లాడారు. కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ్‌ బొమ్మై మాట్లాడుతూ.. ”భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని. సుదీప్‌ మాటలు సరైనవే, దానిని అందరూ అర్థం చేసుకొని గౌరవించాలి” అని అన్నారు. ఇక సుదీప్‌కి సపోర్ట్‌గా కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ కూడా మాట్లాడారు. మరి ఈ భాషా వివాదం రాజకీయాల వరకు వెళ్ళింది అంటే ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.