RGV : ముదురుతున్న లాంగ్వేజ్ వార్.. బాలీవుడ్‌కి ఛాలెంజ్ చేస్తూ మధ్యలో దూరిన ఆర్జీవీ..

ఈ ట్వీట్స్ లో ఆర్జీవీ.. ''సో కాల్డ్ లాంగ్వేజ్ వార్ ఇష్యూ గురించి మాట్లాడేముందు హాలీవుడ్ తన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లోకి డబ్బింగ్ చేస్తోందని గమనించాలి. తాజాగా స్పైడర్‌మ్యాన్ సినిమా.............

RGV : ముదురుతున్న లాంగ్వేజ్ వార్.. బాలీవుడ్‌కి ఛాలెంజ్ చేస్తూ మధ్యలో దూరిన ఆర్జీవీ..

Rgv

RGV :  ఇటీవల సౌత్ సినిమాలు వరుసగా భారతదేశమంతటా సక్సెస్ సాధించడమే కాక, బాలీవుడ్ లో అక్కడి సినిమాలని కూడా బీట్ చేసి భారీ విజయాలు సాధిస్తూ కలెక్షన్లని రాబడుతున్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తుండటంతో బాలీవుడ్ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బాలీవుడ్ క్రిటిక్స్ కావాలని సౌత్ సినిమాలపై విషం కక్కుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్ లో కన్నడ స్టార్ హీరో సుదీప్ దీనిపై మాట్లాడుతూ అసలు హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. నార్త్ నెటిజన్లు కొంతమంది సుదీప్ ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సుదీప్ వ్యాఖ్యలకి కౌంటర్ గా హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాకపోతే మీ సినిమాలు ఇక్కడ ఎందుకు డబ్ చేస్తున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో వారిద్దరి మధ్య ట్వీట్ వార్ మొదలైంది. ఇక వీరి ట్వీట్స్ కి పలువురు ప్రముఖులు కూడా రిప్లైలు ఇచ్చారు. ఇది సౌత్, నార్త్ పోయి లాంగ్వేజ్ వార్ గా మారింది.

చుట్టూ జరిగే విషయాల్లో కచ్చితంగా వేలు పెట్టె ఆర్జీవీ ఈ విషయంలో కూడా నేను ఉన్నా అంటూ వరుస ట్వీట్స్ చేశాడు. ఇప్పటికే అజయ్ దేవగణ్, సుదీప్ చేసిన ట్వీట్స్ కి ఆర్జీవీ తనదైన స్టైల్ లో సౌత్ లేదు, నార్త్ లేదు ఉన్నది ఇండియా ఒక్కటే అంటూ ట్వీట్స్ చేశారు. అంతటితో ఆగకుండా మళ్ళీ ఇవాళ కూడా ఈ వివాదంపై బాలీవుడ్ వాళ్ళని ఉద్దేశించి ఆర్జీవీ వరుస ట్వీట్స్ చేశాడు.

 

ఈ ట్వీట్స్ లో ఆర్జీవీ.. ”సో కాల్డ్ లాంగ్వేజ్ వార్ ఇష్యూ గురించి మాట్లాడేముందు హాలీవుడ్ తన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లోకి డబ్బింగ్ చేస్తోందని గమనించాలి. తాజాగా స్పైడర్‌మ్యాన్ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ వంటి భారతదేశంలోనే 10 భాషల్లో డబ్ చేయబడింది. KGF 2, RRR, పుష్ప సినిమాలు కేవలం హిందీలో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం వంటి మొదలైన భాషల్లో కూడా డబ్ చేయబడింది. ఇది ఆ సినిమా నిర్మాతల ఇష్టం. వారికి ఎంత దూరం రీచ్ అవ్వాలి అనుకుంటే అన్ని భాషల్లో డబ్ చేస్తారు.”

Nikhil : వేలాదిమందికి దిశా నిర్దేశం చేశావు.. మిస్ యు నాన్న.. హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్

”గతంలో హిందీ సినిమాలు మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్ మరియి ఇటీవల దంగల్ లాంటి సినిమాలు డబ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ అయ్యాయి. అవి తెలుగుతో పాటు వేరే రాష్ట్రాలలో కూడా హిట్ అయ్యాయి. కానీ వాటి కలెక్షన్లు ప్రాంతీయ సినిమాలు డబ్ చేస్తే వచ్చిన సినిమాల కలెక్షన్స్ రేంజ్ లో రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఒక కన్నడ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్ సినిమా అక్కడి అన్ని ఒరిజినల్ సినిమాల కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ సాధించిందని షాక్ అయింది. దీని బట్టి హిందీ ప్రజలు కూడా మంచి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారని, అది ఎక్కడ నుండి వస్తున్నా పట్టించుకోరని రుజువు అయింది.”

Bollywood Remakes: రీమేక్ మాయలో బాలీవుడ్.. సౌత్ కంటెంట్ కావాలంటున్న స్టార్స్!

”భాషా యుద్ధాలకు బదులు అన్ని భాషలలో ఒకరినొకరు అధిగమించేందుకు భారతదేశంలోని తారలు మరియు దర్శకుల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ మొదలైతే దేశంలోని ప్రేక్షకులు అన్ని చోట్ల నుండి అన్ని సినిమాలని చూసి ఏది బెస్ట్, ఎవరు బెస్ట్ అని వాళ్ళే నిర్ణయిస్తారు. కాదనలేని వాస్తవం ఏంటంటే సౌత్ స్టార్ హీరోలు బాలీవుడ్ స్టార్ హీరోలకి షాకిచ్చారు. కాబట్టి బాలీవుడ్ స్టార్స్ వాళ్ళ సినిమాలని డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి భారీ విజయం సాధించి కలెక్షన్స్ రాబట్టాలని ఛాలెంజ్ చేస్తున్నాను” అంటూ వరుస ట్వీట్స్ చేశారు.