Chiranjeevi: మరో సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు ‘భోళాశంకర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు సోదరి పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేయాలని చిరు ప్లాన్ చేస్తున్నాడు.

Chiranjeevi: మరో సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

Chiranjeevi To Do A Movie With PS Mithran

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు ‘భోళాశంకర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు సోదరి పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేయాలని చిరు ప్లాన్ చేస్తున్నాడు.

Chiranjeevi : మొన్న గాడ్‌ఫాదర్, ఇప్పుడు వాల్తేరు వీరయ్య.. నెట్‌ఫ్లిక్స్‌ని కూడా ఏలుతున్న చిరు!

ఈ సినిమా తరువాత మరో డైరెక్టర్ వెంకీ కుడుములతో చిరు ఓ సినిమా చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు కూడా చిరు ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రముఖ రైటర్ బీవీఎస్.రవి మెగాస్టార్ చిరంజీవికి ఓ అద్భుతమైన కథను ఇటీవల వినిపించాడట. ఈ కథ చిరుకి బాగానే నచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాను తమిళ దర్శకుడు పిఎస్.మిత్రన్ డైరెక్ట్ చేయబోతున్నాడట. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాకు సుస్మితా కొణిదెల కూడా ఒక నిర్మాతగా వ్యవహరించనుంది.

Chiranjeevi : కూతురికి చిరంజీవి ఖరీదైన బహుమతి..

మొత్తానికి చిరు ఇలా వరుసగా ప్రాజెక్టులను ఓకే చేస్తూ, స్పీడును చూపిస్తుండటంతో యంగ్ హీరోలకు మెగాస్టార్ గట్టి పోటీనివ్వడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.