Chiranjeevi : మొన్న గాడ్‌ఫాదర్, ఇప్పుడు వాల్తేరు వీరయ్య.. నెట్‌ఫ్లిక్స్‌ని కూడా ఏలుతున్న చిరు!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీస్ గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య మూడు నెలలు గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ వద్దనే కాదు ఈ రెండు చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.

Chiranjeevi : మొన్న గాడ్‌ఫాదర్, ఇప్పుడు వాల్తేరు వీరయ్య.. నెట్‌ఫ్లిక్స్‌ని కూడా ఏలుతున్న చిరు!

waltair veerayya is number one streaming movie in netflix india

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీస్ గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య మూడు నెలలు గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. గాడ్‌ఫాదర్ గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కాగా, వాల్తేరు వీరయ్య ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయ్యింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సినిమా కేవలం హిట్టుగా నిలిస్తే, మరొకటి మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓటిటి వచ్చేపాటికి ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ అయ్యిని. బాక్స్ ఆఫీస్ వద్దనే కాదు ఈ రెండు చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.

Chiranjeevi : కూతురికి చిరంజీవి ఖరీదైన బహుమతి..

ఓటిటిలో రిలీజ్ అయిన గాడ్‌ఫాదర్.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి, కొన్ని వారలు పాటు ఇండియా వైడ్ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ప్లేస్ లో నిలిచింది. తాజాగా గత వారం ఓటిటిలో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ప్లేస్ లో రన్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ వీక్లీ టాప్ టెన్ ఫిలిమ్స్ లిస్ట్ ని రిలీజ్ చేయగా.. వీటిలో మొదటి స్థానంలో వాల్తేరు వీరయ్య నిలవగా, తరువాత ప్లేస్ లో హాలీవుడ్ మూవీ ‘వి హ్యావ్ ఏ ఘోస్ట్’, బాలీవుడ్ మూవీ ‘సర్కస్’, ఇరట్టా, బుట్టబొమ్మ, మిషన్ మజ్ను, తునీవు, హీట్ వేవ్, నంపకల్ నిరతు మయక్కం, యాన్ యాక్షన్ హీరో చిత్రాలు నిలిచాయి.

RC15 : చరణ్ బర్త్ డేకి టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్.. కన్‍ఫార్మ్ చేసిన దిల్ రాజు!

బాక్స్ ఆఫీస్ వద్దనే కాదు ఓటిటిలో కూడా చిరంజీవి డామినేషన్ ఉండడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా చిరంజీవి చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా చేస్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)