RC15 : చరణ్ బర్త్ డేకి టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్.. కన్‍ఫార్మ్ చేసిన దిల్ రాజు!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'RC15'. కాగా ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిని నిజం చేస్తూ దిల్ రాజు కన్‍ఫార్మ్ చేశాడు.

RC15 : చరణ్ బర్త్ డేకి టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్.. కన్‍ఫార్మ్ చేసిన దిల్ రాజు!

RC15 producer confirms a title announcement is coming on ram charan birthday

RC15 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘RC15’. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తన నిర్మాణ సంస్థలో ఈ చిత్రం 50 సినిమాగా తెరకెక్కుతుండడంతో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. దాదాపు 170 కోట్ల బడ్జెట్ ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Sai Pallavi : ఎన్టీఆర్, చరణ్, బన్నీలలో సాయి పల్లవి ఎవరితో డాన్స్ చేయాలి అనుకుంటుందో తెలుసా?

ఇక ఈ సినిమా అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు పూర్తి అవుతున్నా ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడంతో గత కొంత కాలంగా దిల్ రాజుని సోషల్ మీడియా వేదికగా చరణ్ అభిమానులు ప్రశ్నిస్తూనే వస్తున్నారు. కాగా ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిని నిజం చేస్తూ దిల్ రాజు కన్‍ఫార్మ్ చేశాడు.

Ram Charan : హాలీవుడ్ ప్రేక్షకులకు అయ్యప్ప దీక్ష గురించి చెప్పిన రామ్‍చరణ్!

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. చరణ్ బర్త్ డేకి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ అనౌన్స్ చేయబోతున్నాము అంటూ వెల్లడించాడు. అలాగే రిలీజ్ గురించి మాట్లాడుతూ.. డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరికి సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అయితే రిలీజ్ విషయం మాత్రం పూర్తిగా డైరెక్టర్ నిర్ణయం అంటూ తెలియజేశాడు. ఇక ఈ వ్యాఖ్యలు విన్న చరణ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

కాగా ఈ సినిమాకి CEO (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్), సేనాని, సైనికుడు అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు శంకర్ సైనికుడు టైటిల్ కి ఓటు వేస్తే, యూనిట్ లోని ఎక్కువమంది సేనాని టైటిల్ కి ఓటు వేశారని సమాచారం. అయితే నెటిజెన్లు CEO టైటిల్ అయితే RRR లా పాన్ ఇండియా టైటిల్ లా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.