Ram Charan : హాలీవుడ్ ప్రేక్షకులకు అయ్యప్ప దీక్ష గురించి చెప్పిన రామ్‍చరణ్!

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ని ఎక్కువగా అయ్యప్ప దీక్షలో చూస్తుంటాం. తాజాగా ప్రముఖ అమెరికా పోడ్‌క్యాస్ట్ టాక్ షో 'టాక్ ఈజీ'కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ మొదటిలోనే విలేకరి.. మీరు ధరించే దీక్ష గురించి చెబుతారా? అని ప్రశించాడు. రామ్ చరణ్ బదులిస్తూ..

Ram Charan : హాలీవుడ్ ప్రేక్షకులకు అయ్యప్ప దీక్ష గురించి చెప్పిన రామ్‍చరణ్!

ram charan ayyappa mala

Updated On : March 9, 2023 / 12:02 PM IST

Ram Charan : టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ని ఎక్కువగా అయ్యప్ప దీక్షలో చూస్తుంటాం. ఇటీవల అమెరికా వెళ్లే సమయంలో కూడా చరణ్ అయ్యప్ప మాలలోనే ఉన్నాడు. అమెరికాలో దిగిన తరువాత 21 రోజులు దీక్ష (అర్ధ మండల దీక్ష) పూర్తి కావడంతో, అక్కడ ఒక హిందూ టెంపుల్ లో పద్ధతి ప్రకారం రామ్ చరణ్ దీక్షా విరమణ చేశాడు. ఇక ఆ తరువాత అక్కడ పలు పాపులర్ టాక్ షోలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న చరణ్.. తాజాగా ప్రముఖ పోడ్‌క్యాస్ట్ టాక్ షో ‘టాక్ ఈజీ’కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ మొదటిలోనే విలేకరి.. మీరు ధరించే దీక్ష గురించి చెబుతారా? అని ప్రశించాడు.

Ram Charan : ఆమె సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా చాలు.. రామ్‌చరణ్!

రామ్ చరణ్ బదులిస్తూ.. ”15 సంవత్సరాలు నుంచి నేను అయ్యప్ప దీక్షని ఆచరిస్తున్నాను. దీక్ష వచ్చి 48 రోజులు ఉంటుంది. ఆ రోజుల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరించి, చల్లని నీళ్లతో స్నానం చేయడం, చెప్పులు లేకుండా నడవడం, నేలపైనే పడుకోవడం.. ఇలా ఎటువంటి లగ్జరీ లైఫ్ లేకుండా బ్రతుకుతాం. ఆ దీక్ష సమయంలో ఆడవారిని అసలు తాకకూడదు, చివరికి నా భార్యని కూడా తాకకూడదు. ఈ దీక్ష అనేది దైవ చింతనే జీవించేందుకు చేస్తుంటాం. సాధువులు కూడా సంవత్సరాలు పాటు దీక్ష చేస్తుంటారు.

నేను నమ్మేది ఏంటంటే.. దీక్ష అనేది దైవ చింతనే జీవించేందుకు మాత్రమే కాదు. దీక్ష మనలోని మనోబలాన్ని కూడా పెంచుతుంది. ఒక నటుడిగా మాకు ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి మానసికంగా, శారీరకంగా నన్ను నేను దృడంగా మార్చుకోడానికి దీక్ష ఉపయోగపడుతుంది” అంటూ దీక్షలోని గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు. ఇక మన సంప్రదాయాన్ని ఇతర దేశాలకు కూడా తెలిసేలా చేస్తున్న రామ్ చరణ్ ని నెటిజెన్లు అభినందిస్తున్నారు.