Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

దర్శకుడు బోయపాటి అఖండ బ్లాక్ బస్టర్ సినిమాతో మరోసారి ఊరమస్ జాతర కొనసాగించాడు. అంచనాలకి మించి అఖండని ప్యాక్ చేయడంలో బోయపాటి నూటికి వెయ్యిశాతం సక్సెస్ కాగా.. బోయపాటి తర్వాత సినిమా..

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

Ram Boyapati

Ram-Boyapati: దర్శకుడు బోయపాటి అఖండ బ్లాక్ బస్టర్ సినిమాతో మరోసారి ఊరమస్ జాతర కొనసాగించాడు. అంచనాలకి మించి అఖండని ప్యాక్ చేయడంలో బోయపాటి నూటికి వెయ్యిశాతం సక్సెస్ కాగా.. బోయపాటి తర్వాత సినిమా ఏంటన్నది ఆసక్తిగా మారింది. నిజానికి బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే.. అల్లు అర్జున్ పుష్ప రెండో పార్ట్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరో ఏడాది పుష్ప రెండో పార్టీ పూర్తయ్యే వరకు బన్నీ మేకోవర్ అలాగే ఉండాలి.

Khiladi: ఈ వారమే ఖిలాడీ రిలీజ్.. ప్రమోషన్ల హడావుడి లేదేంటి?

దీంతో మరో ఏడాది వరకు బోయపాటి బన్నీ డేట్స్ కి స్కోప్ లేకపోవడంతో యంగ్ హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. నిజానికి ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రచారం మొదలైంది. అయితే.. ఇప్పుడు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో వారియర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాగా ఇది ద్విభాషా సినిమా. బోయపాటి దర్శకత్వంలో రాబోయే సినిమాను కూడా బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కనుందట.

Rajinikanth: విజయ్ దర్శకుడితో సూపర్ స్టార్ కథా చర్చలు.. ఫైనల్ అయ్యేనా?

ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తుండగా.. రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ లో కనిపిస్తాడని, ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చుట్టూ ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. మరి.. ఊరమస్ దర్శకుడి దర్శకత్వం ఉస్తాద్ హీరో ఎలా కనిపించనున్నాడన్నది ఆసక్తిగా మారింది.